
Baby Movie Rashmika Emotional: తెలుగు సినీ లవర్స్ చాలారోజుల నుంచి ఓ సినిమా కోసం ఎదురుచూశారు. అదే 'బేబి'. గత కొన్నాళ్లుగా మెలోడీ సాంగ్స్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. చూసినవాళ్లందరూ బాగుందని అంటున్నారు. అయితే ఇదే సినిమా ప్రీమియర్ షోకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
(ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప‍్పుడే!)
రష‍్మిక ఎమోషనల్!
'బేబి' సినిమాలో ఆనంద్ దేవరకొండ ఓ హీరోగా నటించాడు. అతడి అన్న విజయ్ దేవరకొండతో పాటు రష్మిక కూడా.. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ లో నిన్న రాత్రి వేసిన ప్రీమియర్ షోకి వచ్చారు. ఇక సినిమా చూసిన తర్వాత రష్మిక కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించింది. థియేటర్ నుంచి బయటకొస్తూ పెద్దగా ఏం మాట్లాడుకుండానే వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బేబి కథేంటి?
వైష్ణవి(వైష్ణవి చైతన్య) బస్తీ అమ్మాయి. ఎదురింట్లో ఉండే ఆనంద్(ఆనంద్ దేవరకొండ)తో లవ్‌లో పడుతుంది. స్కూల్‌లోనే వీళ్ల ప్రేమ ముదిరిపోతుంది. అయితే పది పాస్ అయిన వైష్ణవి ఇంజినీరింగ్ వరకు వెళ్తుంది. ఆనంద్ మాత్రం ఫెయిలై ఆటో డ్రైవర్‌గా మారతాడు. ఇక కాలేజీకి వెళ‍్లి వైషూ లైఫ్‌లోకి విరాజ్(విరాజ్ అశ‍్విన్) వస్తాడు. మరి చివరకు ఏమైంది? ఆనంద్-వైషూ ఒక్కటయ్యారా లేదా అనేది మెయిన్ స్టోరీ.
Cutiee #RashmikaMandanna got emotional post watching #BabyMovie in Hyderabad@iamRashmika pic.twitter.com/xKTS6OXzOj
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 13, 2023
(ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?)