Actor Babushan Mohanty Says I Will Not Do Film With Prakruti Mishra, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Babushaan Mohanty Video: హీరోయిన్‌పై హీరో భార్య దాడి.. ఆమెతో సినిమా చేయనన్న నటుడు

Jul 24 2022 4:49 PM | Updated on Jul 24 2022 5:56 PM

Babushan Mohanty: I Will Not Do Film With Prakruti Mishra - Sakshi

వైరల్‌గా మారిన మా వీడియోను చూసి ఎంజాయ్‌ చేస్తున్నట్లున్నారు. కానీ నేను మీకో విషయాన్ని స్పష్టం చేయాలి. చెన్నైలో ఓ ఈవెంట్‌కు వెళ్లాను, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు ప్రకృతిని కూడా పిలిచారు.

ఒడియా హీరో బాబుషాన్‌ మెహంతి, హీరోయిన్‌ ప్రకృతితో కారులో కనిపించాడు. ఇంకేముందీ విషయం తెలుసుకున్న హీరో భార్య తృప్తి వారికి నడిరోడ్డు మీదే ఆపి హీరోయిన్‌ను చెడుగుడు ఆడుకుంది. జుట్టుపట్టుకుని లాగుతూ ప్రకృతిపై దాడి చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. తాజాగా దీనిపై హీరో బాబుషాన్‌ స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.. 'వైరల్‌గా మారిన మా వీడియోను చూసి ఎంజాయ్‌ చేస్తున్నట్లున్నారు. కానీ నేను మీకో విషయాన్ని స్పష్టం చేయాలి. చెన్నైలో ఓ ఈవెంట్‌కు వెళ్లాను, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు ప్రకృతిని కూడా పిలిచారు. నిజానికి మేమిద్దరం త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం, దాన్ని అధికారికంగా ప్రకటించాలనుకునేలోపే ఇలా జరిగింది. నా కుటుంబం ఈ రకంగా ఆలోచిస్తుందని ఊహించలేదు. ప్రకృతి వాళ్లకు సమస్య అయితే ఆమెతో నేను సినిమా చేయను.. ఇంకా అవసరమైతే భవిష్యత్తులోనూ ఏ హీరోయిన్‌తో పని చేయను' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: హీరోయిన్‌పై హీరో భార్య దాడి, వీడియో వైరల్‌
కేటీఆర్‌ గారూ, ఈ సినిమాల మీద ఓ లుక్కేయండి..

Advertisement
 
Advertisement
Advertisement