శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా రాముడు అందిరివాడు’. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని లువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ముందుగా మంచి టైటిల్ తో ప్రేక్షకుల ముందు రావడం గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో ఎంతో పెద్ద హీరోలు పెట్టుకునే స్థాయిలో ఈ చిత్ర టైటిల్ చాలా బావుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా బావుంటే దూసుకెళ్లిపోయే రోజులు. అటువంటి ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో గద్దర్ నరసన్న పాట పాడటం ప్రత్యేకం. సినిమా బృందం అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థిస్తున్నాను" అన్నారు.
దర్శకుడు మైకిల్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ సినిమాలోని 4 పాటలు అన్ని నేను రాసాను, దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సినిమా కోసం లక్ష్మణ్ గారు ఎంతో పట్టుదలతో నటించారు. హీరో శ్రీరామ్ ఈ సినిమాకు ముందుగా నాంది పలికారు. చాలా కష్టపడి చిన్న స్థాయి నుండి హీరో స్థాయికి వచ్చారు. నటి స్వాతి నవరసాలు పండిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. మా సినిమాను ప్రోత్సహించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. అందరూ మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.
నిర్మాత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ...ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్, నటి స్వాతి ఇంకా ఎంతో మంది పేరుగాంచిన నటీనటులకు అందరికీ సినిమాలో నటించినందుకు థాంక్స్. అలాగే దర్శకుడు మైకిల్ తన ప్రాణం పెట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అలాగే మా కోసం వచ్చిన బాబు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందచేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. నటి స్వాతి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.


