ఆషు రెడ్డి హీరోయిన్‌గా ‘పద్మ వ్యూహంలో చక్రధారి' | Sakshi
Sakshi News home page

ఆషు రెడ్డి హీరోయిన్‌గా ‘పద్మ వ్యూహంలో చక్రధారి'

Published Thu, Feb 15 2024 6:05 PM

Ashu Reddy Comments On PadmaVyuham Lo Chakradhari Movie - Sakshi

యంగ్ ట్యాలెంటెడ్ ప్రవీణ్ రాజ్ కుమార్ ,‘బిగ్‌బాస్‌’ ఫేం అషు రెడ్డి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పద్మ వ్యూహంలో చక్రధారి’. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వం వహిస్తున్న ఈ వ్యూర్‌ లవ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రానికి  కె.ఓ.రామరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టైటిల్‌ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ ఉంటుంది. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అయితే తన ఫస్ట్ లవ్ వద్దే ఆగిపోయిన ఓ వ్యక్తి అక్కడి నుంచి ఎలా బయటికి వచ్చాడనే పాత్రలో మధునందన్ కనిపిస్తారు. ఆ పాత్ర చాలా గుర్తుండిపోతుంది. ఆషు కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు.

ర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. 'పద్మ వ్యూహంలో చక్రధారి' పేరు చాలా యునిక్ గా వుంది. కంటెంట్ కూడా భిన్నంగా వుంటుంది. ప్రవీణ్ రాజ్ కుమార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు 

ప్రెస్ మీట్ లో ముఖ్య అతిదిగా వచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..'పద్మ వ్యూహంలో చక్రధారి' టైటిల్ , పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రవీణ్ రాజ్ కుమార్, ఆషు రెడ్డి, శశికా టిక్కో, మదునందన్, భూపాల్ రాజు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'అన్నారు

ఆషు రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో పద్మ అనే పాత్ర చేస్తున్నాను. చాలా భిన్నమైన పాత్ర ఇది. ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు' తెలిపారు. 

మధునందన్ మాట్లాడుతూ.. చాలా ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. దర్శకుడు చాలా యునిక్ కథని ఎంచుకున్నాడు. మంచి భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.

Advertisement
 
Advertisement