
మాస్ కా దాస్‌గా తొలి సినిమాతో గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. అయితే వ్యక్తిగత జీవితంలో కాదు సినిమాలో..
‘ఫలక్‌నుమాదాస్’, ‘హిట్’ చిత్రాల ఫేమ్ విశ్వక్‌సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా షురూ అయింది. విద్యాసాగర్ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు.బి, సుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విష్వక్ సేన్ తల్లి దుర్గ క్లాప్ కొట్టారు. బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ –‘‘లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో, సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. వినోదం సహా అన్ని అంశాలున్న ఎంటర్‌టైనర్ ఇది. విష్వక్ నటించిన, నటిస్తోన్న చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా’’ అన్నారు.