సల్మాన్‌ సోదరి వివాహంతో మళ్లీ చిగురించిన మైత్రి

Arpita Khan Wedding Thawed tIce Between Shah Rukh Khan and Salman Khan - Sakshi

మన మధ్య వచ్చే గొడవలు, వివాదాలకు శుభకార్యాలతో శుభం పలకడం సాధారణంగా జరిగే విషయం. సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా ఇదే పద్దతి వర్తిస్తుంది. బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య తలెత్తిన వివాదానికి ఓ వివాహమే శుభం కార్డు వేసింది. ఏంటా వివాదం.. ఎవరిదా పెళ్లి అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌లది పాతికేళ్ల మైత్రి బంధం. అయితే కత్రినా కైఫ్‌ పుట్టిన రోజులో జరిగిన ఓ గొడవతో వీరి ఫ్రెండ్‌షిప్‌ బ్రేక్‌ అయ్యింది. ఇద్దరు స్టార్‌ హీరోలే.. ఇగో కూడా ఒకే రేంజ్‌లో ఉంటుంది. దాంతో మధ్యవర్తిత్వం లాంటి ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి. ఇక వీరిద్దరి మధ్య దూరం శాశ్వతంగా కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే అనూహ్యంగా ఓ పెళ్లి కార్డు వీరి మధ్య దూరానికి శుభం కార్డు వేసింది. ఇద్దరు స్టార్లని కలిపిన ఆ పెళ్లి ఎవరిది అంటే సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ది‌. (చదవండి: ‘ఐశ్వర్య విషయంలో దురదృష్ట వంతుడిని’)

అవును ఈ వివాహంతోనే ఇద్దరి హీరోల మధ్య దూరం కరిగిపోయింది. సల్మాన్‌ తన సోదరి వివాహాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. హైదరాబాద్‌లోని ఫలక్‌నమా ప్యాలేస్‌ వివాహ వేదికగా మారిపోయింది. అయితే అనూహ్యంగా ఈ వివాహాని​కి తాను హాజరవుతున్నట్లు షారుక్‌ ప్రకటించారు. ‘అర్పిత పెళ్లికి నేను తప్పక వెళ్తాను. చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి అర్పిత నాకు తెలుసు. తనను నా చేతుల్లో పెంచాను. ఆమె నాకు సోదరి. ఆహ్వానం అందకపోయినా సరే తన పెళ్లికి నేను తప్పక హాజరవుతాను. వారు నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. నేను తప్పక వెళ్తాను’ అన్నారు. అయితే షారుక్‌ వివాహానికి కాకుండా ముంబైలో జరిగిన సంగీత్‌ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఇక రిసెప్షన్‌లో అతిథులని పలకరించి.. కుటుంబ సభ్యుడి మాదిరిగానే డ్యాన్స్‌ కూడా చేశారు. ఓ నెల తర్వాత ఓ కార్యక్రమంలో షారుక్‌.. తనకు, సల్మాన్‌కు మధ్య ఏర్పడ్డ ప్యాచ్‌ అప్‌ గురించి మాట్లాడారు. (చదవండి: ఆమెతో సల్మాన్‌ పెళ్లి ప్రపోజల్‌ రిజక్ట్‌ అయింది..)

"అహంకారంతో కాదు, చాలా వినయంతో చెప్తున్నాను. మా ఇద్దరి జీవితాల్లో ఆనందకరమైన క్షణాలు ఎక్కువగా ఉన్నాయి. బాధపడ్డ క్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. కాని నేను భరోసా ఇవ్వగల ఒక విషయం ఏమిటంటే, జీవితంలో మేం ఎల్లప్పుడూ ఒకరితోఒకరి ఆనందం, నిరాశపూరిత క్షణాలను కలిసి పంచుకుంటాం. మేం ఇప్పుడు కలిసి పోయాం. ప్రస్తుతం మా మధ్య ఉన్న బంధం గత 25 సంవత్సరాలుగా ఎలా ఉందే ఇప్పుడు అలానే ఉంది. చేడు ఉద్ధేశాలు లేవు. బయటి నుంచి చూసే వారికి మేం పొగరుబోతులుగా.. గొడవపడే వారిగా కనిపించవచ్చు. కానీ మా స్నేహం ముందు అవన్ని చాలా స్వల్పం. అర్పిత నా కళ్ళ ముందు పెరిగింది. ఇక్కడ విషయం ఏంటంఏ మా సోదరి వివాహం చేసుకోబోతుంది.. ఇలాంటి ఆనంద సమయంలో నేను తనతో ఉండాలి. అందుకే వెళ్లాను" అన్నారు షారుక్‌. ఇక అర్పిత, ఆయుష్‌ శర్మల వివాహం జరిగి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top