
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆరె రెహమాన్.. రీసెంట్‌గా విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇతడి భార్య సైరా భాను లాయర్ బయటపెట్టాడు. ఇద్దరు ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. కానీ రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈయన దగ్గర పనిచేస్తున్న మోహిని దే అనే అమ్మాయి కూడా భర్తకు డివోర్స్ ఇచ్చింది. దీంతో రుమార్స్ మొదలయ్యాయి.
(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)
రెహమాన్-మోహిని దే మధ్య రిలేషన్ ఉన్నట్లు పలువురు ఆర్టికల్స్ రాశారు. యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవాలని, ఇలాంటివి ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏఆర్ రెహమాన్ టీమ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రకటన రిలీజ్ చేసింది.
తన గురించి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు టీమ్ పేర్కొంది. ఇప్పటికే పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెహమాన్.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీస్తున్న సినిమా కోసం పనిచేస్తున్నారు.
(ఇదీ చదవండి: ప్రభుత్వం ఉద్యోగం సాధించిన సుకుమార్ ఇంట్లో పనిమనిషి)
Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x
— A.R.Rahman (@arrahman) November 23, 2024