మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో 'వజ్ర కాళేశ్వరి దేవి' పెళ్లి | Aparna Das And Manjummel Boys Actor Deepak Parambol Wedding Card Goes Viral - Sakshi
Sakshi News home page

మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో 'వజ్ర కాళేశ్వరి దేవి' పెళ్లి

Published Wed, Apr 3 2024 11:18 AM

Aparna Das And Deepak Parambol Wedding Card Viral - Sakshi

మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ అపర్ణా దాస్ త్వరలో వివాహ బంధంలో అడుగుబెట్టబోతుంది. టాలీవుడ్‌లో ఆదికేశ‌వ‌ చిత్రంలో  వజ్ర కాళేశ్వరీ దేవిగా ఆమె మెప్పించిన విషయం తెలిసిందే.  గతేడాది త‌మిళంలో రిలీజైన దాదాతో బిగ్గెస్ట్  హిట్టును అందుకోవడంతో ఒక్కసారిగా ఆమె సౌత్‌ ఇండియా ప్రేక్షకులందరికీ దగ్గరైంది.

త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ అప‌ర్ణ‌దాస్ 
మలయాళ హిట్‌ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒక‌రిగా క‌నిపించిన దీప‌క్ ప‌రంబోల్‌తో అప‌ర్ణ‌దాస్ వివాహం జరగనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్‌లో సుధి పాత్ర‌లో మెప్పించిన దీప‌క్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 24న కేర‌ళ‌లోని వ‌డ‌క్క‌చేరిలో అప‌ర్ణ‌దాస్‌, దీప‌క్ వివాహం జరగబోతుందని వివాహ శుభలేఖ కూడా నెట్టింట వైరల్‌ అవుతుంది.ఈ మేరకు ఆమె ఫ్యాన్‌ అకౌంట్‌ నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

టిక్‌టాక్‌ నుంచి హీరోయిన్‌గా
మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ నటించిన ఆదికేశ‌వ‌లో అప‌ర్ణ‌దాస్  కీలక పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరీ దేవి పాత్రను ఆమె పోషించింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదు. ఇకపోతే తమిళంలో 'దాదా' అనే సినిమాలో  ఓ బిడ్డ‌కు తల్లిగా కనిపించిన అప‌ర్ణ‌దాస్  ప్రేక్షకులను కట్టిపడేసింది. అక్కడ భారీ హిట్‌ కొట్టిన ఈ సినిమా త్వరలో తెలుగులో 'పా..పా' పేరుతో విడుదల కానుంది. దుబాయ్‌లో ఎంబీఏ పూర్తిచేసిన ఆమె టిక్‌టాక్ వీడియోల నుంచి విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. దీంతో ఆమెకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement