పేరు తీసేయాల్సిందే.. అనుపమ సినిమాకు కష్టాలు | Anupama Parameswaran Janaki Vs State Of Kerala Censor Issue | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: నో చెప్పిన సెన్సార్.. మేకర్స్ ఏం చేస్తారో?

Jun 23 2025 11:35 AM | Updated on Jun 23 2025 12:29 PM

Anupama Parameswaran Janaki Vs State Of Kerala Censor Issue

టాలీవుడ్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. సీనియర్ నటుడు, ప్రస్తుత కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగింది?

(ఇదీ చదవండి: దేవి శ్రీ ప్రసాద్‌కి డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరు?)

జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాని డైరెక్టర్ ప్రవీణ్‌ నారాయణ్‌ తీశారు. అయితే జానకి అనే పేరు సీతాదేవికి మర పేరు అని, అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్‌ కూడా ఈ వివాదం గురించి మాట్లాడారు.

సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్‌ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్‌, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు అని ఉన్నికృష్ణన్ గుర్తుచేశారు. మరి ఈ విషయంలో చిత్రబృందం ఏం చేస్తుందో చూడాలి? 

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి అంజలి పవన్ సీమంతం వేడుక)

Advertisement
 
Advertisement
Advertisement