తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక | Serial Actress Anjali Pavan Seemantham | Sakshi
Sakshi News home page

Anjali: రెండో ప్రెగ్నెన్సీ.. ఘనంగా సీమంతం సెలబ్రేషన్స్

Jun 23 2025 10:23 AM | Updated on Jun 23 2025 10:32 AM

Serial Actress Anjali Pavan Seemantham

తెలుగు సీరియల్ నటి అంజలికి సీమంతం వేడుకలు సందడిగా జరిగాయి. 'మొగలిరేకులు' సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. తర్వాత పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఇప్పుడు తనకు సీమంతం జరిగిందని చెబుతూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?)

'మొగలిరేకులు'లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ చేసింది. వీటితో పాటు మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ నటించింది. అలానే లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈమె.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు చందమామ అనే కూతురు కూడా ఉంది.

కొన్నేళ్ల క్రితం సీరియల్స్ పూర్తిగా తగ్గించేసిన అంజలి.. భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. ఎ‍క్కువగా కూతురు చందమామతో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ల ముందు ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన ఈమె.. ఇప్పుడు తనకు గ్రాండ్‌గా సీమంతం జరిగిన విషయాన్ని వీడియో రూపంలో ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు యాంకర్ స్రవంతితో పాటు అర్జున్ అంబటి, శ్వేతా నాయుడు, యష్మీ తదితరులు వచ్చారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement
 
Advertisement
Advertisement