
పచ్చని చెట్ల మధ్య ఎర్రని గులాబీలా ఎరుపు రంగు డ్రెస్‌లో మెరిసిపోయారు అనుపమా పరమేశ్వరన్. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరచిపోయారీ బ్యూటీ. షూటింగ్స్‌కి కాస్త విరామం దొరకడంతో ‘పచ్చందనమే... పచ్చదనమే’ అంటూ ఇలా సేద తీరారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అనుపమ షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అభిమాన తార ఇలా కలర్‌ఫుల్‌గా కనిపించడంతో ఆమె అభిమానులు ‘బ్యూటిఫుల్’ అని కితాబులిచ్చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే... అనుపమ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘పరదా’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించిన ‘కిష్కింధపురి’ చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె తమిళ చిత్రం ‘బైసన్’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు.