Anupam Kher: సౌత్‌ సినిమాలపై అనుపమ్‌ ఖేర్‌ ప్రశంసలు, బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌

Anupam Kher Says Bollywood Selling Stars While South Films Telling Stories - Sakshi

ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది. అక్కడ వరుసగా సినిమాలు పరాజయం కావడం, దక్షిణాది చిత్రాలు అక్కడ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. బాలీవుడ్‌ చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ సందర్భంగా బాలీవుడ్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు. దక్షిణాది పరిశ్రమ మంచి కథల చూట్టూ తిరుగుతుంటే బాలీవుడ్‌ మాత్రం హీరోలను అమ్ముకునే ఆలోచనలో ఉందన్నారు.

చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్‌

అందుకే హిందీ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సౌత్‌ ఇండస్ట్రీ కథలపై దృష్టి పెడుతుంది బాలీవుడ్‌ పరిశ్రమ మాత్రం హీరోలపై దృష్టి పెడుతుంది. అందుకే సౌత్ సినిమాలు దూసుకెళ్తుంటే బాలీవుడ్ డీలా పడిపోతుంది’ అన్నారు. ‘‘మనం వినియోగదారుల కోసం వస్తువులను తయారు చేస్తున్నాం అనుకుందాం. ఎప్పుడైతే వినియోగదారులను చిన్నచూపు చూడటం ప్రారంభిస్తామో అప్పటి నుంచే సమస్య మొదలవుతుంది. ‘మేం ఒక గొప్ప సినిమా చేయడం వల్ల మీరు లాభం పొందుతున్నారని, మీరు ఒక గొప్ప సినిమా చూస్తారు’ అనుకోవడం తప్పు. ఎందుకంటే గొప్పతనం అనేది సమిష్టి కృషితో సాధ్యం అవుతుంది.

చదవండి: ఆ డైరెక్టర్‌కి అలా హగ్‌ ఇచ్చా.. అందరు వింతగా చూశారు: కియారా

ఈ  విషయాన్ని తెలుగులో పనిచేయడం వల్ల నేను నేర్చుకున్నా. ఈ మధ్యే తెలుగులో కార్తీకేయ 2లో నటించా. తమిళంలో కూడా ఒక సినిమా చేశాను. ఇప్పుడు మలయాళ చిత్రంలో కూడా నటించబోతున్నాను. అయితే దక్షిణాదిలో నేను ఏ రెండింటి మధ్య తేడా చూడటం లేదు. అక్కడి వాళ్లు కథను నమ్ముకుంటారు తప్పా హాలీవుడ్‌ను ఇష్టపడరు. కానీ ఇక్కడ(బాలీవుడ్‌) మేం స్టార్లను అమ్ముతున్నాం’’ అని అన్నారు. కాగా అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ‘కార్తికేయ 2’లో ఆయన అతిధి పాత్రలో కనిపించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం.. హిందీతో పాటు పలు భాషల్లో భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top