Ankita Thakur in Mrs India Global Finale - Sakshi
Sakshi News home page

Ankita Thakur: మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ఫైనల్స్‌కు అంకిత..

Apr 8 2023 8:33 PM | Updated on Apr 8 2023 8:57 PM

Ankita Thakur in Mrs India Global Finale - Sakshi

తెలంగాణకు ప్రాతినిధ్యం వ‌హిస్తూ మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ఫైన‌ల్స్‌కు చేరుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లంతా ఓటింగ్ ద్వారా నాకు స‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నా. కొ

పెగాసిస్ వారు నిర్వ‌హిస్తోన్న 'మిసెస్ ఇండియా గ్లోబ‌ల్' ఫైన‌ల్స్‌కు సెల‌క్ట్ అయ్యారు సినీన‌టి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేర‌ళలోని కొచ్చిలో ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా గ్లోబ‌ల్‌కు సెల‌క్ట్ అయిన అంకిత ఠాకూర్ శనివారం నాడు ఫిలించాంబ‌ర్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో `మిస్ ఏసియా` ర‌ష్మి ఠాకూర్‌, తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ...``తెలంగాణకు ప్రాతినిధ్యం వ‌హిస్తూ మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ఫైన‌ల్స్‌కు చేరుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లంతా ఓటింగ్ ద్వారా నాకు స‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నా. కొచ్చిలో ఈ నెల 11న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్`  ఫైన‌ల్స్ జ‌రగ‌నున్నాయి` అన్నారు. `మిస్ ఏసియా`, తెలంగాణ మా అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ర‌ష్మీ ఠాకూర్ మాట్లాడుతూ... 'పెగాసిస్ వారు కండ‌క్ట్ చేస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ` ఫైన‌ల్స్‌కు చేరుకున్న అంకిత ఠాకూర్ నాకు క‌జిన్ అవుతారు. గ‌త కొంత కాలంగా త‌న‌కు నేను ట్రైనీగా ఉన్నాను. క‌చ్చితంగా త‌ను `మిస్ ఇండియా గ్లోబ‌ల్` క్రౌన్ గెలుచుకుని వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.  మ‌న తెలంగాణను రిప్ర‌జెంట్ చేస్తోన్న అంకిత ఠాకూర్ కి ఓటింగ్ ద్వారా తెలంగాణతో పాటు తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

తెలంగాణ ఫిలించాంబ‌ర్ చైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ...``గ‌తంలో మిస్ ఏసియా టైటిల్ గెలుచుకున్న ర‌ష్మీ ఠాకూర్‌కు మా తెలంగాణ ఫిలించాబ‌ర్ ఎంతో స‌పోర్ట్ చేసింది. ఇప్పుడు అంకిత ఠాకూర్‌కు కూడా ఫుల్ స‌పోర్ట్ ఉంటుంది`` అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement