
Anchor Rashmi Gautam Fires On Delhi Zoo Employee : బుల్లితెర యాంకర్‌గా దూసుకుపోతున్న రష్మీ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ మూగజీవీలపై ఎంతో ప్రేమ చూపిస్తుంటుంది. తాజాగా జూ సిబ్బందిపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ప్రముఖ జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ భారీ నీటి ఏనుగు ఉంది.
దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో కేజ్ నుంచి నీటి ఏనుగు తల బయటకు పెట్టి చూస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాని తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా అది చూసి రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
జూ సిబ్బంది ప్రవర్తించిన తీరు బాధాకరమని పేర్కింది. లాక్‌డౌన్‌లో మూడు నెలలు ఇంట్లో బందిస్తేనే మనం ఎంతో అల్లాడిపోయాం. అలాంటిది జీవితాంతం బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఆలోచించండి. బ్యాన్ జూ అంటూ రష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.