Anchor Lasya: Constructing House For Her Father Video Goes Viral - Sakshi
Sakshi News home page

Anchor Lasya: తండ్రికి ఇల్లు క‌ట్టిస్తున్న యాంక‌ర్ లాస్య‌

Jan 15 2022 7:52 PM | Updated on Jan 16 2022 8:46 AM

Anchor Lasya Constructing House For Her Father - Sakshi

నేను చిన్న‌ప్పుడు ఉన్న ఇంటిని ఆ మ‌ధ్య‌ కూల‌గొట్టాం క‌దా, దాని స్థానంలో కొత్తింటిని క‌ట్టిస్తున్నాము. ఇప్ప‌టికే అది చాలావ‌ర‌కు పూర్త‌యిందంటూ ఆ ఇల్లును చూపించింది.

యాంక‌ర్ లాస్య‌.. హోస్టింగ్‌తోనే కాదు, చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపుల‌ర్ ఆమె. యాంక‌ర్‌గా స్టేజీపై ఆమె చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. గ‌తంలో కొన్నాళ్ల‌పాటు బుల్లితెర‌కు దూర‌మైన లాస్య ఈమ‌ధ్య టీవీ షోల‌తో బిజీబిజీగా మారింది. అలాగే వీలున్న‌ప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తోంది. తాజాగా ఆమె త‌న తండ్రికి ఇల్లు క‌ట్టిస్తోంది. ఈ విష‌యాన్ని అభిమానుల‌కు వెల్ల‌డించిన లాస్య ఈమేర‌కు ఓ వీడియోను రిలీజ్ చేసింది.

'నేను చిన్న‌ప్పుడు ఉన్న ఇంటిని ఆ మ‌ధ్య‌ కూల‌గొట్టాం క‌దా, దాని స్థానంలో కొత్తింటిని క‌ట్టిస్తున్నాము. ఇప్ప‌టికే అది చాలావ‌ర‌కు పూర్త‌యింది' అంటూ ఆ ఇల్లును చూపించింది. నాన్న క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టానికి నేనేదైనా చేస్తాను. ఆయ‌న సంతోషం చూస్తుంటే క‌డుపు నిండిపోతుంది. ఆయ‌న కోసం ఇష్టంతో ఇల్లు క‌ట్టిస్తున్నానంటూ గ‌దుల‌న్నింటినీ చూపించింది. గృహ‌ప్ర‌వేశం చేసేట‌ప్పుడు త‌ప్ప‌కుండా పూర్తిగా చూపిస్తామ‌ని చెప్పుకొచ్చింది. అలాగే తండ్రికి గిఫ్టిచ్చిన ట్రాక్ట‌ర్‌ను చూపించ‌డ‌మే కాకుండా అందులో ఎక్కి తిరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement