Anasuya Bharadwaj: భయపెట్టడానికి ట్రై చేశా.. ఇదో అద్భుతమైన సినిమా: అనసూయ 

Anasuya Bharadwaj Comments at Darja Movie Prerelease Event - Sakshi

సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో శివశంకర్‌ పైడిపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో అనసూయ మాట్లాడుతూ– ‘‘దర్జా’లో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ఇది అద్భుతమైన సినిమా’’ అన్నారు.

‘‘ఫిక్షన్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది.. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ స్టోరీ’’ అన్నారు సలీమ్‌ మాలిక్‌. ‘‘దర్జా’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కామినేని శ్రీనివాస్‌. ‘‘మా అన్నయ్య శివశంకర్‌గారు సినిమా నిర్మించాలనుకున్నప్పుడు భయపడ్డాం. కానీ ఆయన క్రమశిక్షణ, పట్టుదల చూసి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి. ఈ వేడుకలో నిర్మాత నవీన్‌ ఎర్నేని, కరీంనగర్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సత్యనారాయణ, సంగీత దర్శకుడు ర్యాప్‌ రాప్‌ షకీల్, హీరో సందీప్‌ మాధవ్, దర్శకులు వీర    శంకర్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top