అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్! | Ananya Panday Reveals Qualities About Her Ideal Husband Amid Relationship Rumors With Aditya Roy Kapur - Sakshi
Sakshi News home page

Ananya Panday: ఆదిత్య రాయ్‌ కపూర్‌తో డేటింగ్.. కాబోయే వాడు అలా ఉంటేనే!

Published Tue, Aug 22 2023 4:51 PM

Ananya Panday reveals her ideal Mr Right amid relationship rumors with Aditya Roy Kapur - Sakshi

లైగర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కొత్త హీరోయిన్‌ అనన్య పాండే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అయిపోయింది భామ. అయితే ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్‌లో ఉందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. 

(ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్‌లో ఉండనుంది'.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నటుడు!)

అయితే ప్రస్తుతం డ్రీమ్ గర్ల్-2 నటిస్తోన్న భామ ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అతను ఎలా ఉండాలో వివరించింది. అతనిలో తాను కోరుకునే లక్షణాల గురించి వెల్లడించింది. కాగా.. అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్- 2  ఆగస్ట్ 25న  శుక్రవారం విడుదలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని 2019 హిట్ ఫిల్మ్ డ్రీమ్ గర్ల్‌కి సీక్వెల్‌గా తెరకెక్కించారు. 

అనన్య మాట్లాడుతూ..' ఓ గాడ్. నాకు మా నాన్నే ఆదర్శం. నాకు కాబోయే వారు మా నాన్నలా దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉండాలి. ఆయనే నాకు బెంచ్‌మార్క్. మా నాన్న అత్యుత్తమ వ్యక్తి. అందుకే అతనికి అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే ఇటీవల నా సినిమాలు లేకపోవడంతో నా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వారి దృష్టి నా సినిమాలపై పెడతారేమో వేచి చూడాలి.' అని అన్నారు. ఆదిత్య రాయ్ కపూర్‌తో రిలేషన్‌పై మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.  అయితే డ్రీమ్ గర్ల్-2 తర్వాత ఫర్హాన్ అక్తర్ చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించే సైబర్ థ్రిల్లర్‌లో కనిపించనుంది.

(ఇది చదవండి: ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement