
ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘శివంగి’(shivangi). దేవరాజ్ భరణీ ధరణ్ దర్శకత్వంలో పి. నరేశ్‌బాబు నిర్మించిన ఈ పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ మార్చి 7న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నా జీవితంలో జరిగిన రెండు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి.
ఒక అమ్మాయికి ఒక్క రోజుకి ఇన్ని కష్టాలు, సత్యభామ అంటే ఏదో చందమామ కథలు చెప్పే భామ అనుకున్నావేమో... సత్యభామ రా... ఇక్కడ బ్యూటీ నేనే... బీస్ట్‌ని నేనే’’ అనే డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి. జాన్ విజయ్, డా. కోయ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ సంగీతం అందించారు.