నా భర్త చెబితేనే బోల్డ్‌ సినిమాలో నటించా: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

నా భర్త చెబితేనే బోల్డ్‌ సన్నివేశాల్లో నటించా: హీరోయిన్‌

Published Thu, Jan 4 2024 11:13 AM

Anandhi Talk About Mangai Movie - Sakshi

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. ఒకవేళ సినిమాల్లో నటించినా.. అసభ్యకర సన్నివేశాలు..రొమాంటిక్‌ సీన్స్‌ లేకుండా జాగ్రత్త పడతారు. కానీ హీరోయిన్‌ ఆనంది మాత్రం ఇందుకు మినహాయింపు. పెళ్లి అయిన తర్వాత కూడా బోల్డ్‌ సినిమాలో నటించింది. అయితే అది మంచి సందేశాత్మక చిత్రం కావడం వల్లే తాను అలా నటించానని చెబుతోంది. అంతేకాదు ఆ సినిమాలో నటించాలని తన భర్త ప్రోత్సహించాడట. ఆ తమిళ సినిమా పేరు మంగై.

మంగై అంటే తెలుగులో పడుచు పిల్ల అని అర్థం. మున్నార్‌ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఫేస్‌ చేసింది. ఆమె అనుభవాలు ఏంటనేది ఈ సినిమా కథ. ఓ ఆడపిల్లను మగాడు చూసే కోణంలో  ఈ సినిమా సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా ఈ సినిమా కథనం ఎలా సాగుతుందో తెలియజేస్తుంది.

 అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు ఆనంది నటించలేనని చెప్పిందట. మంచి సందేశాత్మక చిత్రమే అయినప్పటికీ.. బోల్డ్‌ సన్నివేశాలు, డైలాగ్స్‌ ఉన్నాయట. దీంతో తొలుత ఆనంది ఈ కథను రిజెక్ట్‌ చేసిందట. కానీ ఆమె భర్త మాత్రం ఓ నటిలాగా ఆలోచించమని చెప్పారట. ఆయన ప్రోత్సాహం వల్లే చాలా కంపర్ట్‌గా ఈ సినిమాలో నటించానని ఓ ఇంటర్వ్యూలో ఆనంది చెప్పింది.  

ఇక ఆనంది విషయానికొస్తే.. తమిళ సినిమాలతో బాగా పాపులర్‌ అయిన తెలుగమ్మాయి. ఈమె స్వస్థలం తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా. తెలుగులో చాన్స్‌లు రాకపోవడంతో కోలీవుడ్‌కి వెళ్లి అక్కడ వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అసలు పేరు రక్షిత. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును హాసికగా మార్చుకున్నారు. ఆ పేరు కలిసి రాక ఆనందిగా మార్చుకుంది.  2021లో తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది. తెలుగులో జాంబీరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్‌ లాంటి సినిమాల్లో నటించింది.

Advertisement
Advertisement