సినిమాల్లో ఆ హీరోయిన్‌ అంటే క్రష్: ఆనంద్ దేవరకొండ | Anand Deverakonda Reveals His First Crush During Summer Holidays Movie Promotional Event, More Details Inside | Sakshi
Sakshi News home page

Anand Devarakonda: సినిమాల్లో ఆ హీరోయిన్‌ అంటే క్రష్: ఆనంద్ దేవరకొండ

Jul 1 2026 9:20 PM | Updated on Jul 2 2026 4:09 PM

Anand Devarakonda Revealed his crush In Actressses

టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ  ప్రస్తుతం ఎపిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య మరోసారి ఆనంద్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఆనంద్ దేవరకొండ తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.  సమ్మర్‌ హాలీడేస్‌ మూవీలోని క్రష్ సాంగ్ లాంఛ్‌ ఈవెంట్‌లో ముఖ్య‍ అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఆనంద్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ ఫస్ట్ క్రష్‌ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆనంద్ దేవరకొండ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఏదైనా సినిమా చూసేటప్పుడు హీరోయిన్లపై క్రష్‌ ఉంటుంది.. అలా మురారి చూసినప్పుడు నాకు సోనాలి బింద్రేపై క్రష్ ఫీలింగ్ వచ్చిందని అన్నారు.

కాగా..  రోహన్‌ రాయ్‌, అరుణ్ దేవ్‌ ప్రధానపాత్రల్లో, శ్రీకర్‌ నాయన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం సమ్మర్‌ హాలీడేస్‌. ఈ మూవీని బాల్యం కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో జయసుధ, వాసుకి ఆనంద్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement