‘అమ్మోరు’ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?

Ammoru Movie Child Artist Sunaina Present Life Story In Telugu - Sakshi

Ammoru Child Artist Sunaina Story: సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్‌ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది క్యారెస్ట్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా ఎదిగారు. మరికొంతమంది చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగినవారు ఉన్నారు. వారిలో రాశి, శ్రీదేవి, మీనా లాంటి వారు ఉన్నారు. అయితే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్‌గా మారుతారని గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ సునైనా బాదం.
 
సునైనా బాదం అని చెబితే ఎవరికీ అర్థం కాదు. కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అమ్మోరు’సినిమా గుర్తుంది కదా? ఈ సినిమాలో నటించిన మరో పవర్ ఫుల్ చైల్డ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలా  సౌందర్య వద్దకు వచ్చే అమ్మోరు తల్లే సునైనా బాదం. ఆ సినిమాలో సౌందర్యను ఇంట్లో వాళ్లందరూ బాధిస్తుంటే.. అమ్మోరు తల్లి చిన్న పిల్లగా మారి సౌందర్యకు రక్షణగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్లతో గంభీరంగా కనిపించిన సునైనా ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించింది. అప్పట్లో ఆ చిన్నారి నిజంగానే దేవత అని జనాలు అనుకున్నారంటే.. ఆ క్యారెక్టర్‌లో ఆమె ఎంత జీవించేసేందో అర్థం చేసుకోవచ్చు. 

ఇలా బాల నటిగా పలు సినిమాల్లో  కనిపించి మెప్పించిన సునైన ఆ తర్వాత కూడా ప్రేక్షకులతో టచ్‌ లోనే ఉంది. గత కొంత కాలంగా యూట్యూబ్‌ లో ఫ్రస్టేటెడ్‌ వీడియోలతో బాగా పాపుర్‌ అయ్యింది. సమంత ‘ఓబేబీ’సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కూతురిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సునైనా షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆమె చేసిన '​ఫ్రస్టేటెడ్‌ ఉమెన్‌’అనే షార్ట్‌ ఫిలిమ్స్‌ ద్వారా చాలా ఫేమస్‌ అయ్యారు. అయితే చాలా మంది చైల్డ్‌ ఆర్టిస్ట్‌లు హీరోయిన్లుగా అవుతుంటే.. సునైనా మాత్రం యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ ఫేమస్‌ అవుతున్నారు.  హీరోయిన్ కావాలని పెద్దగా ఆశ లేదు. కానీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించాలని మాత్రం ఉంది అని సునైనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సునైనా బాదం భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలని ఆశిద్దాం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top