అల్లు స్నేహ విన్యాసాలు మాములుగా లేవుగా..ఫోటొ వైరల్‌ | Allu Arjun Wife Sneha Reddy Stunning Yoga Pose Image Goes Vial | Sakshi
Sakshi News home page

అల్లు స్నేహ విన్యాసాలు మాములుగా లేవుగా..ఫోటొ వైరల్‌

Jul 9 2021 11:18 AM | Updated on Jul 9 2021 4:44 PM

Allu Arjun Wife Sneha Reddy Stunning Yoga Pose Image Goes Vial - Sakshi

అల్లు అర్జున్‌ సతీమణి అల్లు స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఆమె ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే.  బన్నీతో పాటు తన పిల్లలు అయాన్‌, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే అల్లు అర్జున్‌ న్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా స్నేహ రెడ్డి తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు.

స్నేహా రెడ్డి కొన్నాళ్లుగా యోగాలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే త‌ల‌కిందకు పెట్టి గాల్లో వేలాడుతూ చేసే యోగాస‌నంపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు స్నేహా ఆ ఫీట్ సాధించారు. త‌న సోష‌ల్ మీడియాలో ఈ ఫీట్‌కు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయ‌గా.. ప్రస్తుతం అది వైరల్‌ అయింది. స్నేహ విన్యాసనాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement