Watch: Allu Arjun Pushpa 2 The Rule Movie Teaser Released, Video Viral - Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Teaser: పుష్పరాజ్‌ను చూసి వెనక్కి తగ్గిన పులి.. అదిరిపోయిన టీజర్‌

Apr 7 2023 4:52 PM | Updated on Apr 7 2023 5:26 PM

Allu Arjun, Sukumar Pushpa 2 The Rule Movie Teaser Launched - Sakshi

‘పుష్ప’ మూవీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. దీంతో ఈ మూవీ పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల  విడుదలైన గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో పుష్ప 2 అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేపు బన్నీ బర్త్‌డే సందర్భంగా తాజాగా క్రేజీ అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌.

ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన వీడియో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఎనిమిది బుల్లెట్లు తగిలిన గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ టీజర్‌ మొదలైంది. పుష్ప చనిపోయాడంటూ ప్రచారం చేస్తున్నట్టుగా టీజర్‌ మొదలైంది. ఇక సడెన్‌గా అడవిలో పులి ముందు నుంచి పుష్ప రాజ్‌ అలా నడుస్తూ వెళుతున్న వీడియో ఉత్కంఠ పెంచుతోంది.

‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని దాని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ వచ్చే ఈ డైలాగ్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయం. మొత్తానికి ఎంతోకాలంగా పుష్ప 2 అప్‌డేట్‌ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ టీజర్‌తో ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు సుకుమార్‌. కాగా ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement