అల్లు అర్జున్‌ పుష్ప మూవీ.. ఆ స్టైల్‌ కాపీ కొట్టేశారా? | Is Allu Arjun Walking Style Mannerism Not Original In Pushpa Movie? This Viral Video Is The Proof- Sakshi
Sakshi News home page

Pushpa Movie: ఏంది పుష్పా.. అప్పుడెప్పుడో చేసుండారా?

Published Tue, Mar 26 2024 8:09 PM

Allu Arjun pushpa Walking Style By Tollywood Hero Goes Viral - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్‌ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్‌ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు.

అయితే ఈ సినిమాలో పుష్పరాజ్‌ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్‌కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ డైలాగ్స్, వాకింగ్ స్టైల్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్‌ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. 

అయితే ‍అచ్చం అల్లు అర్జున్‌ లాగే ఆ వాకింగ్‌ స్టైల్‌ను టాలీవుడ్‌ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్‌ స్టైల్‌తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement