పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్.. రిలీజ్‌ టైమ్ ఇదే! | Allu Arjun Pushpa 2 First Single Release Date and Time Revealed | Sakshi
Sakshi News home page

Pushpa 2 First Single: పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్.. ఏకంగా ఆరు భాషల్లో!

Apr 30 2024 6:15 PM | Updated on Apr 30 2024 7:32 PM

Allu Arjun Pushpa 2 First Single Release Date and Time Revealed

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ను ప్రకటించారు మేకర్స్‌.

మే 1వ తేదీన ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్‌ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

కాగా.. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్‌ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement