ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్‌! | Allu Arjun Plans To Release Two Movies In Next Year | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఆ విషయంలో ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న బన్నీ!

Apr 13 2024 11:54 AM | Updated on Apr 13 2024 12:13 PM

Allu Arjun Plans To Release Two Movies In Next Year - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న ఎన్టీఆర్‌.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవరతో పాటు బాలీవుడ్‌లో వార్‌-2లోనూ నటిస్తున్నాడు. అయితే దేవర సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత వార్‌-2 సెట్స్‌పైకి వెళ్తాడాని అంతా భావించారు. ఎన్టీఆర్‌ ప్లాన్‌ కూడా అదేనట. కానీ కొన్ని కారణాల వల్ల దేవర షూటింగ్‌ని నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఎన్టీఆర్‌ వార్‌-2 సెట్స్‌పైకి వెళ్లాడు. అటు దేవరతో పాటు ఇటు వార్‌-2ని కూడా కంప్లీట్‌ చేసి.. వేరే సినిమాపై ఫోకస్‌ పెట్టాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్‌. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా ఎన్టీఆర్‌ రూటునే ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

(చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి)

బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తోనూ మరో సినిమా చేయాబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు బన్నీ తన ప్లాన్‌ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్‌ సినిమాల్లో నటించాలనుకుంటున్నాడట. 

(చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?)

త్వరలోనే అట్లీ సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ కూడా ఇప్పుడు తన​ ఫోకస్‌ అంతా అల్లు అర్జున్‌ సినిమా మీదనే పెట్టాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొని.. వచ్చే ఏడాదిలో రెండింటిని విడుదల చేసేలా బన్నీ ప్లాన్‌ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో బన్నీ రెండు సినిమాలలో అభిమానులను అలరిస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement