కథ విన్నారా? | Allu Arjun next film with Nelson Dilipkumar | Sakshi
Sakshi News home page

కథ విన్నారా?

Jul 16 2024 12:49 AM | Updated on Jul 16 2024 12:49 AM

Allu Arjun next film with Nelson Dilipkumar

అల్లు అర్జున్  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్‌’ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబరు 6న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్  ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. త్రివిక్రమ్, సందీప్‌ రెడ్డి వంగాలతో కొత్త సినిమాలకు అల్లు అర్జున్  ఆల్రెడీ కమిట్‌ అయినప్పటికీ ఈ చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది.

ఈలోపు మరో దర్శకుడితో అల్లు అర్జున్  సినిమా చేయాలనుకుంటున్నారట. దీంతో ఆయన తర్వాతి సినిమా దర్శకుల జాబితాలో అట్లీ, బోయపాటి శీను, సురేందర్‌ రెడ్డి వంటి పేర్లు వినిపించాయి. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్‌’ తీసి బ్లాక్‌బస్టర్‌ అందుకున్న నెల్సన్  దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్  నెక్ట్స్‌ మూవీ తెరకెక్కనుందనే టాక్‌ తాజాగా తెరపైకి వచ్చింది. ఇటీవల నెల్సన్  చెప్పిన స్టోరీ అల్లు అర్జున్ కు నచ్చిందని, దీంతో ఈ కథకు తుది మెరుగులుదిద్దే పనిలో ఉన్నారట నెల్సన్ . అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్ –నెల్సన్  దిలీప్‌ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement