రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్‌ చేసి బిల్లు కట్టిన బన్ని, ఫ్యాన్స్‌ ఫిదా

Allu Arjun Having Breakfast At Road Side Hotel In Kakinada Video Goes Viral - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం కాకినాడలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం పుష్ప మూవీ షూటింగ్‌లో భాగంగా బన్ని ఇటీవల కాకినాడకు వెళ్లాడు. అక్కడ రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని యాక్షన్‌ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీంతో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవ‌రం మీదుగా వెళుతుండగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) విగ్రహం పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్‌ వద్ద ఆగి బన్ని టిఫిన్‌ చేశాడు.

చదవండి: కాకినాడలో అల్లు అర్జున్‌ సందడి..

సాదాసీదాగా ఇలా  రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్‌ చేసి అనంతరం బయటకు వచ్చి బిల్లు కడుతున్న అల్లు అర్జున్‌ను వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు,  అతడి ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top