అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌.. త్వరలోనే ప్రారంభం | Allu Arjun Aaa Cinemas In Ameerpet Soon To Launch | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఓనెనింగ్‌కి ముస్తాబవుతున్న అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌..  ఫోటోలు వైరల్‌

Dec 8 2022 4:22 PM | Updated on Dec 8 2022 4:40 PM

Allu Arjun Aaa Cinemas In Ameerpet Soon To Launch - Sakshi

సినిమాలతో పాటు బిజినెస్‌లపై కూడా దృష్టిపెట్టారు మన స్టార్‌ హీరోలు. ఎంతోమంది హీరోలు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేశ్‌ బాబు ఏషియన్‌ గ్రూప్‌తో కలిసి ఏఎంబీ మాల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు.  అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్‌నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు.

ఇక ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా మల్టీప్లెక్సు రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ అల్లు అర్జున్ పేరిట హైదరాబాద్‌ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కూడా పూర్తయ్యి, ఓపెనింగ్‌కి ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్సును ప్రారంభించనున్నారు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement