‘పాపవినాశనం’పై ప్రముఖుల ప్రశంసలు

Allam Narayana Appreciates Papanasam Short Film - Sakshi

షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకొని స్టార్ట్స్‌గా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు.ఒక చక్కటి సందేశాన్ని షార్ట్ ఫిల్మ్ లో ఇమిడించి అందరిని మెప్పించడం అంటే గొప్ప విషయం. అలాంటి ఒక సందేశాత్మక లఘు చిత్రాన్ని తెరకెక్కించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు దొంగరి మహేందర్ వర్మ. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమా పాపవినాశనం. శివాని, జోష్ రవి, జబర్దస్త్ అప్పారావు, సమ్మెట గాంధీ, దంచెనాల శ్రీనివాస్, ప్రియ, శివ, సాయి రెడ్డి ప్రముఖ పాత్రల్లో నటించారు.

మాస్టర్ లిఖిత్ & అక్షిత్ సమర్పణలో ఇందిర దొంగరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో హైదరాబాద్ లో ప్రదర్శించారు. కాగా ఈ షో కి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ  చీఫ్ విప్  బోడకుంటి వెంకటేశ్వర్లు ,కోదాడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ , కో ఆ సొసైటీ ప్రధాన కార్యదర్శి అంకతి విజయ్ కుమార్,సినీ హీరో ఉత్తేజ్ ,డా. దాచేపల్లి సుధీర్ కుమార్ ,మహేందర్ తదితరులు బంధుమిత్రులతో హాజరయ్యారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top