Alia Bhatt Anchor To Salman Khans Docu-Series Beyond The Star - Sakshi
Sakshi News home page

సల్మాన్‌ జీవితం ఆధారంగా డాక్యుమెంట్‌ సిరీస్‌

Oct 29 2021 7:43 AM | Updated on Oct 29 2021 8:41 AM

Alia Bhatt To Anchor Salman Khans Docu-Series Beyond The Star - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ జీవితం గురించి ఆలియా భట్‌ న్యారేట్‌ చేయనున్నారట. ఆలియా మాత్రమే కాదు.. కొందరు తారలు కూడా ఈ కండలవీరుడి కోసం యాంకర్‌గా మారనున్నారని సమాచారం. సల్మాన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘బియాండ్‌ ది స్టార్‌’ (స్టార్‌డమ్‌ వెనక) డాక్యుమెంట్‌ సిరీస్‌ కోసమే ఇదంతా. సల్మాన్‌ జీవితాన్ని న్యారేట్‌ చేసే పాత్రలో ఆలియా భట్‌ కనిపిస్తారని తెలిసింది. ఈ నెల ప్రారంభంలో ఈ సిరీస్‌ చిత్రీకరణ ఆరంభమైంది.

సల్మాన్‌ వ్యక్తిగత, నటజీవితం నేపథ్యంలో దర్శకుడు విరాఫ్‌ సర్కారీ ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. సల్మాన్‌ తల్లిదండ్రులు, సోదరుల పాత్రలు కూడా సిరీస్‌లో కనిపిస్తాయి. ఇప్పటికే తండ్రి సలీం ఖాన్, సోదరులు సోహైల్‌ ఖాన్, అర్భాజ్‌ ఖాన్‌లు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరిగిందట. అలాగే సల్మాన్‌ స్నేహితులు, నటులు జాకీ ష్రాఫ్, సంజయ్‌ దత్‌ తదితరులు కూడా కనిపిస్తారని భోగట్టా. దర్శకులు సంజయ్‌ లీలా భన్సాలీ, సాజిద్‌ నడియాడ్‌ వాలా, డేవిడ్‌ ధావన్, సూరజ్‌ బర్జాత్యా, కరణ్‌ జోహార్‌ వంటివారు కూడా నటించారట. వచ్చే ఏడాది ఈ సిరీస్‌ విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement