
గత కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కాసారిగా వీళ్లు స్టార్స్ అయిపోయారు. పచ్చళ్ల బిజినెస్ మూతపడినప్పటికీ వీరికి ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఓ కస్టమర్‌తో వీరి సంభాషణ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి మాట్లాడిన డైలాగ్స్‌పై మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి.
ఇదంతా పక్కనపెడితే అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య సడన్‌లో సినిమా ఈవెంట్‌లో కనిపించింది. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లోనే రమ్య సందడి చేసింది. వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పక్కనే కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం రమ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈవెంట్‌కు రమ్య హాజరు కావడంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. పచ్చళ్ల బిజినెస్‌తో ఫేమస్ అయి.. ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా సెలబ్రిటీ అయిపోయారా? అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదేమైనా రమ్య టాలీవుడ్ మూవీ ఈవెంట్‌లో కనిపించడంతో మరోసారి అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. మరి అందరూ ఊహించినట్లుగానే రమ్య ఈ సినిమాలో నటించిందా? లేదా అన్నది తెలియాలంటే ఆమె దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.
గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లలో ఒకరికి తప్పుకుండా బిగ్‌బాస్‌లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరలైంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపించింది. మోడ్రన్ డ్రెస్‌లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. గతంలో జియోహాట్‌స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించిన ఒక సీన్‌ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్‌బాస్‌కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.