సరికొత్త ప్రేమ కథ | Alanati Ramachandrudu First Look Released | Sakshi
Sakshi News home page

సరికొత్త ప్రేమ కథ

Sep 11 2023 6:43 AM | Updated on Sep 11 2023 6:43 AM

Alanati Ramachandrudu First Look Released - Sakshi

కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్‌పై హైమావతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ‘‘అలనాటి రామచంద్రుడు’ సరికొత్త ప్రేమ కథా చిత్రం. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది.

షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసి అవార్డులు అందుకున్న ఆకాష్‌ రెడ్డి తొలిసారి దర్శకునిగా అడుగుపెడుతున్నాడు’’ అన్నారు హైమావతి, శ్రీరామ్‌ జడపోలు. ‘‘మా సినిమా చిరుజల్లుల్లా హాయిగా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చిలుకూరి ఆకాష్‌ రెడ్డి. ఈ చిత్రానికి అసోసియేట్‌ నిర్మాత: విక్రమ్‌ జమ్ముల, కెమెరా: ప్రేమ్‌ సాగర్, సంగీతం: శశాంక్‌ తిరుపతి, లైన్‌ ప్రొడ్యూసర్‌: అవినాష్‌ సామల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గద్దల అన్వేష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement