Akshay Kumar About South, North Cinema Debate - Sakshi
Sakshi News home page

Akshay Kumar: సౌత్‌, నార్త్‌ ఏంటి? ఉన్నది ఒకటే ఇండస్ట్రీ

May 23 2022 12:18 PM | Updated on May 23 2022 12:43 PM

Akshay Kumar About South, North Cinema Debate - Sakshi

సినిమా ఇండస్ట్రీని ఉత్తరాది, దక్షిణాది అని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్‌ దగ్గర బాగా ఆడితే అంతే చాలన్నాడు. బ్రిటీష్‌ పాలకులు ఇండియాను విభజించి పాలించారని,

సౌత్‌ మూవీ, నార్త్‌ మూవీ, పాన్‌ ఇండియా సినిమా.. ఇలా విభజించి మాట్లాడటం తనకు నచ్చదంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌. అతడు ప్రధాన పాత్రలో నటించిన పృథ్వీరాజ్‌ మూవీ తెలుగు, తమిళం, హిందీలో జూన్‌ 3న విడుదలవుతోంది. చంద్రప్రకాశ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్‌ మహారాజు పృథ్వీరాజు చౌహాన్‌గా నటించాడు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీని ఉత్తరాది, దక్షిణాది అని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్‌ దగ్గర బాగా ఆడితే అంతే చాలన్నాడు. బ్రిటీష్‌ పాలకులు ఇండియాను విభజించి పాలించారని, ఇప్పటికీ దాని నుంచి మనం ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తోందని తెలిపాడు. ఉన్నది ఒకటే ఇండస్ట్రీ అని, దాన్ని మెరుగుపర్చేందుకు మనమందరం కలిసి పని చేయాలన్నాడు. అంతేకానీ సౌత్‌ ఇండస్ట్రీ, నార్త్‌ ఇండస్ట్రీ అని మాట్లాడితే తనకసలు నచ్చదన్నాడు.

చదవండి 👉🏾 బెడ్‌ సీన్‌ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్‌ రిప్లై
 నా నామినేషన్స్‌ బాగా నచ్చాయట, కాబట్టి మళ్లీ వెళ్తా: మిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement