
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తొలిసారి విలన్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్- నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జైలర్2లో ఆయన విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. జైలర్ పార్ట్1లో విలన్‌గా వినాయకన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, సిక్వెల్‌లో ఆయన పాత్ర కేవలం రెండుమూడు సీన్ల వరకే ఉంటుందని టాక్. జైలర్2 షూటింగ్‌లో వినాయకన్ రెండురోజులు మాత్రమే పాల్గొనడంతో ఆయన పాత్రపై ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే, ఫుల్ లెన్త్ విలన్‌గా నాగార్జున నటించనున్నారని కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’లో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో, నాగార్జున సిమాన్ అనే పాత్రను పోషిస్తున్నారు. అయితే, ఇందులో కూడా ఆయన పాత్ర నెగటివ్ షేడ్‌లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో క్రేజీ నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ యువ సామ్రాట్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా పలువురు ప్రధాన పాత్రలు పోషించారు. కూలీ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
జైలర్2 షూటింగ్ రీసెంట్‌గా చైన్నె పరిసర ప్రాంతాల్లో కొంత భాగం జరిగింది. ప్రస్తుతం కేరళలో జరుపుకుంటుంది. అక్కడ షూటింగ్‌లో నాగార్జున పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ రెండి విషయాలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రటన రాలేదు. చిత్ర షూటింగ్ డిసెంబర్ పూర్తి అవుతుందని దర్శకుడు ఇప్పటికే చెప్పారు. కాగా దీని తర్వాత రజనీకాంత్ నటించనున్న తదుపరి చిత్రం టాలీవుడ్ యువ దర్శకుడితో చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.