breaking news
Rajinikant
-
కథ, పాత్రలో దమ్ముంటే చాలు ఇలాంటి సినిమాలు హిట్టే
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్. హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తే అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు దక్కే మజానే వేరు. ఖాకీ డ్రెస్‌లో లాఠీ, తు పాకీ చేతబట్టి ఆన్ డ్యూటీలో భాగంగా పవర్ఫుల్ డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సందడి చేస్తుంటారు.పైగా పోలీస్ బ్యాక్‌డ్రాప్ అన్నది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటికే పోలీస్ కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల్లో ‘ఆన్ డ్యూటీ’ అంటూ పోలీస్‌గా విజృంభిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ముత్తువేల్ పాండియన్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ (2023) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ముత్తువేల్ పాండియన్ సత్తా ఏ రేంజ్లో ఉంటుందన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అయితే ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించనున్నారని టాక్. అయితే ఆమె పాత్ర ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్లో తొలిసారి... వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో, ఈ జనరేషన్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఆయన్ని ఖాకీ డ్రెస్‌లో, పవర్ఫుల్ పాత్రలో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ‘స్పిరిట్’ సినిమాతో ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పిరిట్’.ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఖాకీ డ్రెస్‌లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఏ రేంజ్లో విజృంభిస్తారో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి. పోలీస్ జాతర పోలీస్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ (2004)లో మొదటిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాలో విక్రమ్ రాథోడ్‌గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ వంటి సినిమాల్లో పోలీసాఫీసర్‌గా తనదైన మేనరిజమ్‌తో ప్రేక్షకులను అలరించారు రవితేజ.చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలోనూ ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించారు. తాజాగా రవితేజ పోలీస్ ఆఫీర్‌గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్‌లో... పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరోసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కాగా తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరోసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్‌తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డబుల్ ధమాకా హీరో కార్తీ పోలీసాఫీసర్‌గా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్దార్’ (2022) చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తీ–పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సినిమాలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు. తండ్రి ఖైదీ పాత్రలో కనిపించనుండగా ఆయన కొడుకు పాత్ర పవర్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందట. హిట్ 4లో.... తెలుగులో ‘హిట్’ సిరీస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సిరీస్‌లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (విశ్వక్ సేన్), ‘హిట్: ది సెకండ్ కేస్’ (అడివి శేష్), ‘హిట్: ది థర్డ్ కేస్’ (నాని) సినిమాలు విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘హిట్ 4’. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించనున్నారు. ఏసీపీ వీరప్పన్‌గా కార్తీ నటించనున్నట్లు ‘హిట్: ది థర్డ్ కేస్’ క్లైమాక్స్‌లో చూపించారు మేకర్స్.స్పై పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటిæవరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.రెండోసారి... హీరో విశ్వక్ సేన్ రెండోసారి పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ అధికారిగా నటించారు విశ్వక్. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించారు. శ్రీధర్ గంగా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీఎస్ 13’ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎల్వీసీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. విశ్వక్ ఫేస్ కనిపించకుండా పాకెట్లో తు పాకీతో అటువైపు తిరిగి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి యాక్షన్‌కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘బందూక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. రక్షక్! నటనకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన ఓ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలైంది. ఈ చిత్రంలో గజపతి వర్మ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు మనోజ్. అదే విధంగా తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారు మనోజ్. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షక్’. ఈ చిత్రం ద్వారా నవీన్ కొల్లి దర్శకునిగా పరిచయమవుతున్నారు.శ్రీనిధీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు మంచు మనోజ్. మే 20న ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లోని మనోజ్ శక్తిమంతమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొందరు తాము చేసిన నేరాన్ని బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో ఎలా వెలికి తీశాడు? అన్నది కథలో ఆసక్తిగా ఉంటుం దట. అంతేకాదు... ప్రస్తుతం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వేధింపులను కూడా ఇందులో ప్రస్తావించారని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. తండ్రి బాటలో... పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో ఆయన నటన, డైలాగులను ఎప్పటికీ మరచిపోలేరు ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పోలీసాఫీసర్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు సాయికుమార్. తాజాగా ఆయన తనయుడు ఆది సాయికుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఐ యుగంధర్’. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్‌పై ప్రదీప్ జూలూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వైవిధ్యమైన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
జైలర్-2లో విలన్‌గా తెలుగు అగ్ర హీరో
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తొలిసారి విలన్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్- నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్2లో ఆయన విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. జైలర్ పార్ట్1లో విలన్‌గా వినాయకన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, సిక్వెల్లో ఆయన పాత్ర కేవలం రెండుమూడు సీన్ల వరకే ఉంటుందని టాక్. జైలర్2 షూటింగ్లో వినాయకన్ రెండురోజులు మాత్రమే పాల్గొనడంతో ఆయన పాత్రపై ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే, ఫుల్ లెన్త్ విలన్‌గా నాగార్జున నటించనున్నారని కథనాలు వస్తున్నాయి.ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’లో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో, నాగార్జున సిమాన్ అనే పాత్రను పోషిస్తున్నారు. అయితే, ఇందులో కూడా ఆయన పాత్ర నెగటివ్ షేడ్‌లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో క్రేజీ నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ యువ సామ్రాట్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా పలువురు ప్రధాన పాత్రలు పోషించారు. కూలీ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.జైలర్2 షూటింగ్ రీసెంట్గా చైన్నె పరిసర ప్రాంతాల్లో కొంత భాగం జరిగింది. ప్రస్తుతం కేరళలో జరుపుకుంటుంది. అక్కడ షూటింగ్లో నాగార్జున పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ రెండి విషయాలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రటన రాలేదు. చిత్ర షూటింగ్ డిసెంబర్ పూర్తి అవుతుందని దర్శకుడు ఇప్పటికే చెప్పారు. కాగా దీని తర్వాత రజనీకాంత్ నటించనున్న తదుపరి చిత్రం టాలీవుడ్ యువ దర్శకుడితో చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. -
Pooja Hegde: రజనీకాంత్ తో ఐటెం సాంగ్..
-
సూపర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్
-
పేద ప్రజల కోసం రజనీ బిగ్ ప్లాన్?
పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో భారీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వాస్తంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన వయసు రిత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వస్తాయిని వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.. రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయన తన రాజకీయ పార్టీని సమాజ్ సేవా సంఘ్‌గా మార్చిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగు తనను అభిమానించే ప్రజలకోసం తాను ఏమైనా చేయాలని ఆలోచించిన రజనీకాంత్.. పేదల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం తమిళనాడులోని చంగల్పట్టు జిల్లా తిరుప్పురూర్‌లో 12 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. కొద్దిరోజుల క్రితమే అక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించి తాను కొనుగోలు చేసిన 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కూడా ఆయన చేయించుకున్నారు. చెన్నై, తిరుప్పురూర్ మధ్య ఉన్న దూరం దాదాపు 45 కి.మీ ఉంది. అందరికీ అందుబాటులో అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని రజనీ ఉన్నారట. త్వరలో భూమి పూజ కూడా రజనీ ప్రారంభించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ స్థలంపై కచ్చితమైన సమాచారం ఇంకా బయటకు రానప్పటికీ ఆసుపత్రి నిర్మాణం కోసమే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక రజనీకాంత్ సినిమాల టాపిక్‌లోకి వస్తే.. ఇటీవల ఆయన నటించిన 'లాల్ సలామ్' సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఇక కొత్త చిత్రం 'వెట్టయాన్' విషయానికొస్తే, అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో నెలలో షూటింగ్ కూడా పూర్తి కానుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ ఓ చిత్రంలో నటిస్తారు. -
తలైవాతో కేజీఎఫ్ రాకీభాయ్ అదిరిపోయే కాంబినేషన్
-
రజినీకాంత్ చంద్రబాబు ఫోన్ కాల్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు....
-
ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Lights 💡 Camera 🎥 🎬 Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌 Happy #HOLI everyone! 💫 🎬 @ash_rajinikanth 🎶 @arrahman 🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod — Lyca Productions (@LycaProductions) March 7, 2023 -
కూతురుతో కలిసి రజనీని కలిసిన శరత్ కుమార్
నటుడు శరత్ కుమార్ తన కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. వీరిని తలైవా సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నటుడు శరత్ కుమార్ తన ట్విట్టర్లో పొందుపరిచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటుడు శరత్ కుమార్ పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం చూసిన రజనీకాంత్ శరత్ కుమార్‌కు ఫోన్‌చేసి ప్రశంసించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను రజనీకాంత్ కలిసినట్లు శరత్ కుమార్ పేర్కొన్నారు. కూతురు వరలక్ష్మి కూడా రావడంతో తాజాగా నటిస్తున్న చిత్రాలపై కొద్దిసేపు చర్చించినట్లు వెల్లడించారు. -
రజనీకాంత్ పొలిటికల్ రీ ఎంట్రీ.. హాట్ టాపిక్‌గా వారి భేటీ!
సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క రోజు తర్వాత తమిళనాడు గవర్నర్ రవిని కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం రజనీకాంత్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రవితో దాదాపుగా 30 నిమిషాల సేపు మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని రజనీకాంత్ కలిశారని వార్తలొచ్చాయి. గవర్నర్ భేటీ అయిన తలైవా సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయాలపైనే గవర్నర్‌తో చర్చించానని చెప్పారు. అయితే తానేం మాట్లాడానో మీడియాకు వెల్లడించలేనన్నారు. తనకు భవిష్యత్‌లో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ వడ్డించడం గురించి విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న -
రజనీకాంత్‌కి మరోసారి విలన్‌గా రమ్యకృష్ణ..?
రజనీకాంత్‌కి మరోసారి విలన్‌గా మారుతున్నారు రమ్యకృష్ణ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌కు ఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటుల ఎంపిక పనిలో ఉన్నారట నెల్సన్. కాగా ఈ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తారని, కీలక పాత్రలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ యాక్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ విలన్ రోల్‌కు రమ్యకృష్ణను సంప్రదించారట నెల్సన్. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. 1999లో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’) చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో రమ్యకృష్ణ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి ఆమె అలాంటి పాత్రలోనే నటించనుండటంపై ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
రజనీ నెక్స్ట్ మూవీ ఆమె డైరెక్షన్‌లోనేనా?!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీ రాజకీయ అరంగేట్రం, ఇటూ ఆయన నెక్ట్ మూవీ డైరెక్టర్ ఎవరన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే రజనీకి ఇటీవల ఎంతో మంది డైరెక్టర్లు కథ వివరించారట. అందులో యువ దర్శకులతో పాటు ఆయన కూతురు సౌందర్య కూడా ఉండటమే ఇందుకు కారణం. కాగా ప్రస్తుతం రజనీ నటిస్తున్న సినిమా, సినిమాకు ఇదే ఆయన చివరి మూవీ అని త్వరలోనే నటకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు పుకార్లు పుట్టుకోస్తున్నాయి. అంతేగాక ఆయన రాజకీయ ప్రవేశంపై కూడా రూమార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కోసం కూతురు సౌందర్య స్క్రిప్ట్ సిద్దం చేయడంతో మరీ రజనీ తదుపరి చిత్రం ఎవరీ డైరెక్షన్లో అనేది చర్చనీయాంశం మారింది. అయితే ఆయన చివరిగా కూతురు డైరెక్షన్ నటించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అంతేగాక ఆయన అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే సౌందర్య రజనీతో యానిమేటెడ్ మూవీని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్నికలకు దూరంగా రజనీకాంత్ స్నేహితుడు
సాక్షి, చెన్నై: పార్టీ ప్రకటించినా, మేనిఫెస్టో విడుదల చేసినా, 234 స్థానాల్లో ఒంటరి సమరం అన్న నిర్ణయం తీసుకున్నా, చివరి క్షణంలో ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు తలైవా రజనీకాంత్ సన్నిహితుడు అర్జునమూర్తి బుధవారం చెన్నైలో ప్రకటించారు. తాను ప్రకటించనున్న పార్టీకి సమన్వయకర్తగా అర్జునమూర్తిని రజనీకాంత్ నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలతో అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని, రాజకీయాలకు ఇక దూరమని రజనీకాంత్ ప్రకటించారు. దీంతో గత నెల అర్జునమూర్తి సొంత పార్టీగా ఇండియా మక్కల్ మున్నేట్ర కట్చిని ప్రకటించుకున్నారు. ఈ పార్టీకి ఎన్నికల కమిషన్ రోబో చిహ్నం కేటాయించింది. దీంతో గతవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం అర్జున మూర్తి విడుదల చేశారు. 234 స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. వివిధ పార్టీల్లోకి వెళ్తున్న రజనీకాంత్ అభిమానులు తన వైపు రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారంతో నామినేషన్ల గడవు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటిస్తారనుకున్న అర్జునమూర్తి బుధవారం ఓ ప్రకటన చేశారు. అందులో తాను ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. తన పార్టీకి ప్రచారంగా సిద్ధం చేస్తున్న రోబో ఇక్కడకు రావడానికి మరింత సమయం పడుతుందని వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తి పెరుగు తుండడంతో మద్దతుదారుల ఆరోగ్య క్షేమాన్ని కాంక్షించి పోటీ చేయడం లేదని ప్రకటించారు. రజనీ పార్టీ ప్రకటన ముందే యూటర్న్ తీసుకుంటే, ఆయన సన్నిహితుడు పార్టీ ప్రకటించి, మేనిఫెస్టో విడుదల చేసి, ఎన్నికల కమిషన్ కేటాయించిన రోబో చిహ్నాన్ని భుజానకెత్తుకుని నామినేషన్ల చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో విజయకాంత్ సతీమణి -
పారితోషికంలో ప్రభాస్ రికార్డు!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆయన ఇమేజ్ కూడా ఒక్కసారిగా అందనంత ఎత్తుకు వెళ్లింది. ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమాలు చేసినా అవి పలు భాషాల్లోకి డబ్బింగ్ అవుతున్నాయి. అక్కడ కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. బాహుబాలి తరువాత ప్రభాస్ చేసిన సాహో సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ కాలేకపోయినా, వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాన్ని మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్‌గా ప్రభాస్‌కు 100 కోట్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఇచ్చేది రూ. 70 కోట్లు కాగా, డబ్బింగ్ రైట్స్ కోసం మరో రూ. 30 కోట్లు ప్రభాస్‌కు ఇవ్వనున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంది ఇప్పటి వరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే. ఆయన దర్బార్ సినిమాకు రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఆయనను మించిపోయాడు. దీంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించనున్నారు. ప్రభాస్ తాజా సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించనుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. చదవండి: దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? -
నవంబర్‌లో షురూ
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన స్నేహితుడు, హీరో కమల్‌హాసన్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించనున్న ఈ 169వ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ నిర్మించనున్నారు. రజనీకాంత్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నందున ఈ ప్రాజెక్టును నిలిపివేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ‘రజనీ–కమల్ సినిమా ఆగిపోయిందన్నది కేవలం పుకారు మాత్రమే.. ఈ ఏడాది నవంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా గురించి ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించలేదు. పైగా రజనీకాంత్ ఈ చిత్రానికి డేట్స్ ఖరారు చేయాల్సి ఉందట. నవంబరులో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. కాగా ఈ చిత్రంలో రజనీతో కమల్ వెండితెరను పంచుకుంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వీరిద్దరూ కలిసి చివరిసారిగా ‘గిరఫ్తార్’ అనే హిందీ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తుండగా, శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తున్నారు. -
మామ వర్సెస్ అల్లుడు
మామాఅల్లుళ్ల సవాల్ సినిమాల్లో భలే సరదాగా ఉంటాయి. నువ్వా? నేనా? అని మామా అల్లుళ్లు తలపడటం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్లు రజనీకాంత్, ధనుష్ తలపడే అవకాశం కనిపిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. మరోవైపు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘పటాస్’. మెహరీన్, స్నేహా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘పటాస్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దాంతో వచ్చే ఏడాది పొంగల్‌కి బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్ల క్లాష్ ఏర్పడనుందని భావిస్తున్నారంతా. ఏం జరుగుతుందో చూడాలి. -
తొలిచూపు ప్రేమను నమ్ముతా : హీరోయిన్
తొలిచూపు ప్రేమను నమ్ముతున్నానంటూ హీరోయిన్ త్రిష.. ట్విటర్లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. అదేంటి త్రిష మళ్లీ ప్రేమలో పడిందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే త్రిష మాట్లాడుతోంది మనిషి గురించి కాదు.. తనకెంతో ఇష్టమైన డాల్ఫిన్ గురించి. ప్రస్తుతం హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న త్రిష.. ఓ డాల్ఫిన్‌ను ముద్దాడుతూ దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే భావనను నమ్ముతున్నానంటూ’ క్యాప్షన్ జత చేశారు. కాగా ఈ అమ్మడు ప్రేమలో పడిందని చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. 2014లో నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమపెళ్లికి సిద్ధమైందంటూ కథనాలు వచ్చాయి. పెళ్లికి ముందే ప్రేమికుల చిహ్నమైన తాజ్‌మహల్‌ను ప్రియుడితో కలిసి ఆమె చుట్టివచ్చారు. దీంతో పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరు బ్రేకప్ చేసుకున్నారు. ప్రస్తుతం త్రిష కెరీర్‌పై దృష్టి సారించారు. 12 ఏళ్ల నటనా జీవితంలో ఎన్నో విలక్షణమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. ఎందరో స్టార్ హీరోలతో జతకట్టిన త్రిషకు.. ఇంతవరకు రజనీకాంత్‌తో కలిసి నటించే లేదనే లోటు ఉండేది. ప్రస్తుతం ‘పేట’ సినిమాతో ఆ వెలితి కూడా తీరనుంది. -
‘రజనీ ఆలోచనలు ప్రమాదకరం’
తమిళ సినిమా : రజనీకాంత్ ప్రమాదకరమైన ఆలోచనపరుడని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం జరుగుతున్న తమిళుల పోరాటం సినీ రంగంలోనూ సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్‌పై పలువురు సినీ ప్రముఖులు మాటల దాడి చేస్తున్నారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం సినీ దర్శకుడు కే.భారతీరాజా నేతృత్వంలో తమిళగ కళై ఇళక్కియ పన్బాటు పేరవై అనే సంఘాన్ని నెలకొల్సి పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఆందోళన కార్యక్రమంలో ఒక పోలీస్ దాడికి గురయ్యారు. ఈ సంఘటనపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా వర్గం మండిపడుతోంది. ఇదే విషయంపై నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ కావేరి మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం తాము శాంతియుత పోరాటం చేస్తున్నామన్నా రు. ఈ పోరాటంలో ఒక పోలీస్‌ను బాధించటం బాధాకరమేనన్నారు. అయితే ఈ అంశంపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొనే ముందు పోరాటంలో ఏం జరిగిందన్నది తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. పోరాటంలో పాల్గొన్న దర్శకుడు భారతీరాజా, గీతరచయిత వైరముత్తు వంటి వారు ఆయన స్నేహితులేనని, వారిని అడిగి తెలుచుకోవచ్చుగా అని ప్రశ్నించారు. జల్లికట్టు పోరాటంలో జరిగిన దాడి గురించి రజనీ స్పందించలేదని, ఒక పోలీసు ఎత్తిపడేయడంతో మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన గురించి ఆయన స్పందించలేదన్నారు. అలాంటిది కావేరి మేనేజ్మెంట్ బోర్డు కోసం జరుగుతున్న పోరాటంతో గాయాలపాలైన పోలీస్ విషయంలో హింసకు పరాకాష్ట అని పేర్కొన్న రజనీకాంత్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇటీవల అత్యాచారం కారణంగా బలైన చిన్నారి ఆసిఫా ఉదంతంపై కూడా రజనీ స్పందించలేదన్నారు. అలాంటి రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. తమిళనాడును తమిళుడే పాలించాలన్నది తమ లక్ష్యమని సీమాన్ పేర్కొన్నారు. -
నా అభిమానులే మీకు పాఠాలు చెబుతారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ నాయకులెవ్వరూ తన అభిమానులకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని, వారే ఎదుటి వారికి పాఠాలు చెప్పగల నేర్పులని నటుడు రజనీకాంత్ విమర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో ప్రజా సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమాన సంఘాల నుంచి తమ పార్టీ ఉద్భవిస్తోందని, తాము ఇప్పుడు చేయాల్సిందల్లా వాటిని మరింత బలోపేతం చేయడమేనని అన్నారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తయ్యాక రాష్ట్ర పర్యటన చేపడతానన్నారు. కమల్ సమర్థుడు.. ఇటీవల పార్టీ స్థాపించిన సహ నటుడు కమల్ హాసన్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. కమల్ సమర్థుడని, ఆయన ప్రజల విశ్వాసం చూరగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్న తనది, కమల్‌ది రెండు వేర్వేరు దారులని, అయినా ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని అన్నారు. -
‘పవన్ నీకు దమ్ము, ధైర్యం లేదనుకుంటారు’
సాక్షి, హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన అని అభివర్ణించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా తమిళ ప్రజలంతా ఆయనకే ఓటేస్తారని, అతనిపై పోటీ చేయడం దండుగ అని పేర్కొన్నాడు. కొంతమంది తమిళ ప్రజలు తమ గౌరవాన్ని కోల్పోయారని, అది రజనీ తీసుకొస్తానని చెప్పడం గొప్ప విషయమని ప్రశంసించాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలను రజినీకాంత్‌తో పోలుస్తూ మరో కామెంట్ చేశాడు. ఇప్పటికే కేసీఆర్-పవన్ భేటీపై అవసరం ఎంతటికైనా మారస్తుందన్న వర్మ ..'సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేసినట్లుగానే పవన్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో పోటీచేయాలి. అలా జరగకపోతే రజినీకాంత్‌లో ఉన్న దమ్ము, ధైర్యం పవన్‌లో లేవని ఆయన అభిమానులు భావిస్తారు. ఒకవేళ రజినీకాంత్‌లా కాకుండా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం అది మన తెలుగువారి ప్రతిష్టకే అవమానకరం' అని ఫేస్బుక్లో సంచలన పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, మా నేత రెండు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ‘ట్విట్టర్ అజ్ఞాతవాసిలోకి వెళ్లిన నేను పవన్ అజ్ఞాతవాసితో స్పూర్తిని పొంది తిరగి వచ్చా అని’ సెటైరిక్ ట్వీట్ చేశాడు. Twitter Ajnaatavaasam loki velina nenu p k ajnaatavaasi tho inspire ayyi malli vachcha pic.twitter.com/nzjjDcHw5B — Ram Gopal Varma (@RGVzoomin) 2 January 2018 -
రజనీ అడిగినా ‘2.0’ చేయనన్నా!
లడ్డూ లాంటి ఛాన్స్ చేతిదాకా వస్తే చటుక్కున లాగేసుకోవాలని ఎవరైనా అనుకుంటాం. లూస్ చేసుకుంటే లాస్ అవుతాం కదా! కానీ, ఆ లడ్డూ ఆఫర్‌కి మనం అర్హులమా? కాదా? అని ఆలోచించేవాళ్లు మాత్రం లాస్ గురించి ఆలోచించకుండా వదిలేసుకుంటారు. ఆమిర్ ఖాన్ అదే చేశారు. మరి... దాదాపు 400 కోట్ల సినిమాని వదులుకోవడం అంటే నటుడిగా నష్టమే కదా? రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ‘2.0’ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ సినిమాలో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది’’అని ఆమిర్ ఖాన్‌కి స్వయంగా రజనీ ఫోన్ చేశారట. కానీ, ఆమిర్ చాలా వినయంగా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ఆయనకు ‘2.0’ స్క్రిప్ట్ మొత్తం తెలుసు. వసూళ్ల రికార్డులు బద్దలు కొడుతుందని కూడా అనుకున్నారట. మరి.. ఎందుకు చేయకూడదనుకున్నారో ఆమిర్ మాటల్లో తెలుసుకుందాం. ‘‘నిజానికి ‘2.0’ ప్లాన్ చేసినప్పుడు రజనీకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాంతో ఆ సినిమా చేయలేనేమోననుకుని నన్ను చేయమన్నారు. ‘ఏ సమస్య ఉన్నా ఫర్వాలేదు.. మీరే చేయాలి’ అన్నాను. ఎందుకంటే, రజనీలా నేను మేజిక్ చేయలేను. ఆయనలా నేను యాక్ట్ చేయలేను. ఆ స్క్రిప్ట్ గురించి ఎప్పుడు తలుచుకుని కళ్లు మూసుకున్నా... నాకు రజనీయే కనిపించేవారు. దాంతో శంకర్ దగ్గర ‘నేను చేయలేను. ఈ సినిమా రజనీ మాత్రమే చేయగలరు’ అని చెప్పాను. నేను రజనీ అభిమానిని. ఫస్ట్ పార్ట్ (‘రోబో’) చూశాను. ఆయన అద్భుతంగా నటించారు. ఆ నటన నా మనసులో నాటుకుపోయింది. ‘2.0’ ఎన్ని భాషల్లో విడుదలైతే అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అవుతుంది’’ అని ఆమిర్ పేర్కొన్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. -
అమ్మకు రజనీకాంత్ కుటుంబం నివాళి
-
అమ్మకు రజనీకాంత్ కుటుంబం నివాళి
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం ఉంచిన చెన్నైలోని రాజాజీ పబ్లిక్ హాల్‌కు రజనీ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. రజనీ వెంట భార్య లత, అల్లుడు ధనుష్, కుమార్తెలు ఉన్నారు. జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించిన రజనీ.. ఆమె నెచ్చెలి శశికళను పరామర్శించారు. రజనీ కటుంబ సభ్యులు కూడా శశికళను ఓదార్చారు. జయలలిత పార్థివదేహం పక్కన ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో రజనీకాంత్ కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆరాధ్య నాయకురాలు అమ్మను చివరిసారి చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. కన్నీటి వీడ్కోలు పలికేందుకు లక్షలాది జనం రాజాజీ హాల్ కు వస్తున్నారు. -
రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే..
పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్‌గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కోరారు. రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే ఆరోగ్యకరమైన పుదుచ్చేరిగా మారుతుందని అన్నారు. ప్రాస్పరస్ పుదుచ్చేరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలంటూ గతంలో కూడా కిరణ్ బేడీ రజనీకాంత్‌ను కోరారు. మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంగ్ గవర్నర్‌గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టాక ప్రతి శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో కలసి వ్యర్థపదార్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కిరణ్ బేడీ కోరారు. ఇంటి పరిసరాలు, రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి అన్నివిధాలా సాయం చేస్తోందని, పుదుచ్చేరి ఇండస్ట్రియల్ కారిడర్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.