తొలిచూపు ప్రేమను నమ్ముతా : హీరోయిన్‌

Trisha Says She Believes In Love At First sight - Sakshi

తొలిచూపు ప్రేమను నమ్ముతున్నానంటూ హీరోయిన్‌ త్రిష.. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. అదేంటి త్రిష మళ్లీ ప్రేమలో పడిందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే త్రిష మాట్లాడుతోంది మనిషి గురించి కాదు.. తనకెంతో ఇష్టమైన డాల్ఫిన్‌ గురించి. ప్రస్తుతం హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్న త్రిష.. ఓ డాల్ఫిన్‌ను ముద్దాడుతూ దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనే భావనను నమ్ముతున్నానంటూ’  క్యాప్షన్‌ జత చేశారు.

కాగా ఈ అమ్మడు ప్రేమలో పడిందని చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. 2014లో నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో ప్రేమపెళ్లికి సిద్ధమైందంటూ కథనాలు వచ్చాయి. పెళ్లికి ముందే ప్రేమికుల చిహ్నమైన తాజ్‌మహల్‌ను ప్రియుడితో కలిసి ఆమె చుట్టివచ్చారు. దీంతో పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరు బ్రేకప్‌ చేసుకున్నారు. ప్రస్తుతం త్రిష కెరీర్‌పై దృష్టి సారించారు. 12 ఏళ్ల నటనా జీవితంలో ఎన్నో విలక్షణమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. ఎందరో స్టార్‌ హీరోలతో జతకట్టిన త్రిషకు.. ఇంతవరకు రజనీకాంత్‌తో కలిసి నటించే లేదనే లోటు ఉండేది. ప్రస్తుతం ‘పేట’ సినిమాతో ఆ వెలితి కూడా తీరనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top