
రజనీకాంత్‌కి మరోసారి విలన్‌గా మారుతున్నారు రమ్యకృష్ణ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌కు ఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటుల ఎంపిక పనిలో ఉన్నారట నెల్సన్. కాగా ఈ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తారని, కీలక పాత్రలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ యాక్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమాలో ఓ విలన్ రోల్‌కు రమ్యకృష్ణను సంప్రదించారట నెల్సన్. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. 1999లో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’) చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో రమ్యకృష్ణ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి ఆమె అలాంటి పాత్రలోనే నటించనుండటంపై ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.