హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్? | Akkineni Akhil Wife Zainab Ravdjee Details Latest | Sakshi
Sakshi News home page

Akhil Zainab Engagement: అక్కినేని ఫ్యామిలీ చిన్న కోడలు.. ఇంతకీ ఎవరు ఈమె?

Nov 26 2024 6:42 PM | Updated on Nov 26 2024 6:54 PM

Akkineni Akhil Wife Zainab Ravdjee Details Latest

హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.

(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)

అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్‌లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ని కూడా ప్రదర్శించారట.

జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్‌లో ఉంది. అఖిల్‌ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటితో సిరాజ్‌ డేటింగ్‌?.. రూమర్లకు కారణం ఇదే!)

Advertisement
 
Advertisement
Advertisement