Akhanda Box Office Collection: Balakrishna Akhanda Enters Into Rs 100 Crore Club - Sakshi
Sakshi News home page

Akhanda Box Office Collection: ‘అఖండ’జోరు.. సెంచరీ కొట్టిన బాలయ్య

Dec 12 2021 3:17 PM | Updated on Dec 12 2021 3:28 PM

Akhanda Box Office Collection: Balakrishna Akhanda Enters Into Rs 100 Crore Club - Sakshi

నటసింహం నందమూరీ బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’మూవీ జోరు ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్‌ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రొటీన్‌ కథే అయినా.. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు బాలయ్య రెచ్చిపోయి నటించడం.. దానికి తమన్‌ మ్యూజిక్‌ తోడవడంతో థియేటర్స్‌లో బొమ్మ అదిరిపోయింది. బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి  100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ని అందుకోవడం గమనార్హం.

ఈ పది రోజుల్లో.. . నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.  ట్రేడ్ నిపుణుల నుంచి అందిన సమాచారం మేరకు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోరూ. 49.34 కోట్లు షేర్‌ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కలిపితే మొత్తంగా  రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా…. రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. రూ.53 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ వారం రోజుల్లోనే టార్గెట్‌ని పూర్తి చేసుకొని బ్రేక్‌ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది. మొత్తం మీద బాక్సాఫీస్‌ వద్ద బాలయ్య సునామీ సృష్టించడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. . ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి  నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement