అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ | Ajith Kumar Hospitalised In Chennai After Minor Leg Injury At Airport, Know His Health Condition Inside | Sakshi
Sakshi News home page

Ajith Kumar Leg Injury: అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్

Apr 30 2025 3:29 PM | Updated on Apr 30 2025 4:51 PM

Ajith Kumar hospitalised in Chennai after minor leg injury

కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్‌కుమార్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలికి స్వల్ప గాయం కావడంతోనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే అజిత్‌కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. అదే సమయంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ దూసుకు రావడంతో అజిత్ కాలికి స్వల్ప గాయాలైనట్లు ఆయన టీమ్ వెల్లడించింది.

కాగా.. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమానికి హాజరైన అజిత్ కుమార్.. తిరిగి చెన్నై చేరుకున్నారు. అజిత్ రాకపై సమాచారం తెలుసుకున్న అభిమానులు ఆయనకు స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు పెద్దఎత్తున వచ్చారు. ఆ సమయంలో  ఒక్కసారిగా అందరూ అజిత్ వైపు దూసుకు రావడంతో ఆయన పాదానికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

(ఇది చదవండి: బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?)

అజిత్ కుమార్‌ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాలో సునీల్, అర్జున్ దాస్, సిమ్రాన్‌ కీలక పాత్రల్లో మెరిశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement