Ajith -Shalini : విడాకుల రూమర్స్‌పై స్పందించిన స్టార్‌ కపుల్‌!.. ఫోటోలు వైరల్‌

Ajith Kumar And Shalini Breaks Silence On Divorce Rumours - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌లో అజిత్‌-షాలిని ఒకరు. అయితే కొద్దిరోజులుగా వీరికి సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 22ఏళ్ల అజిత్‌-షాలినిల వివాహ బంధంలో కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయని, త్వరలోనే వీరి విడాకులు తీసుకోనున్నారంటూ కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. దీంతో బెస్ట్‌ కపుల్స్‌గా ఉన్న అజిత్‌-షాలినిలు విడిపోవడం ఏంటని అభిమానులు షాక్‌ అయ్యారు.

సోషల్‌ మీడియాలో జోరుగా వినిపిస్తున్న ఈ రూమర్స్‌కి అజిత్‌-షాలినిలు చెక్‌ పెట్టేందుకు డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవలె అజిత్‌తో ఉన్న వరుస ఫోటోలను షాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తాజాగా ఓ వెకేషన్‌కు సంబంధించి భర్తతో కలిసి ఉన్న పిక్స్‌ని పోస్ట్‌ చేసి పరోక్షంగా దీనిపై స్పందించింది.

దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నట్లుగా అజిత్‌-షాలినిల విడాకుల ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అజిత్‌  ‘తునీవు'(తెగింపు) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top