హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు: అజయ్ దేవగణ్‌ | Sakshi
Sakshi News home page

Ajay Devgan: అక్షయ్‌ పాన్‌ మసాలా యాడ్‌ వివాదంపై అజయ్‌ స్పందన.. ఏమన్నాడంటే..

Published Thu, Apr 21 2022 9:21 PM

Ajay Devgn Reaction Controversy Of Akshay Kumar Joining in Pan Masala Ad - Sakshi

Ajay Devgn Reaction Controversy Pan Masala Ad: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పాన్‌ మాసాల ప్రకటన నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోలైన అజయ్‌ దేవగన్‌, షారుక్‌ ఖాన్‌తో కలిసి అక్షయ్‌ ఈ ప్రకటనలో నటించాడు. తాజాగా అక్షయ్‌ ఈ యాడ్‌ ఎండార్స్‌మెంట్‌ వివాదంపై అజయ్‌ దేవగన్‌ స్పందించాడు. ఆయన తాజాగా నటించిన ‘రన్‌వే 34’ మూవీ ఏప్రిల్‌ 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌ భాగంగా అజయ్‌ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాన్‌ మాసాల ఎండార్స్‌మెంట్‌ వివాదంపై, అక్షయ్‌ దీని నుంచి తప్పుకోవడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది.

చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే..

దీనిపై అజయ్‌ దేవగన్‌ స్పందిస్తూ.. ‘నేను దీనిపై పెద్ద మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రకటనల ఎంపిక అనేది వారి వ్యక్తిగత విషయం.  ప్రతి ఒక్కరికి తమకు తాముగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది.  అయితే అదే సమయంలో అది హానికరమా? కాదా? అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అందులో కొన్ని హానికరమైనవి ఉండోచ్చు.. మరికొన్ని ఉండకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే ‘ఇది మాత్రమే కాకుండా హాని కలిగించే ఉత్పత్తులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ విధంగా కూడా వాటిని నేను ప్రమోట్‌ చేయాలనుకోవడం లేదు. అయితే నేను చేసింది ఎలైచి బ్రాండ్‌ యాడ్‌ మాత్రమే’ అని సమాధానం ఇచ్చాడు.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ ఎలివేషన్‌ సీన్‌ను డిలీట్‌ చేశారు: బయటపెట్టిన నటుడు

అనంతరం ఇదంతా  పక్కన పెడితే  ఈ ప్రకటనలు అనేవి పెద్ద విషయం కాదనేది తన అభిప్రాయమని, మరి అవి అంతటి హానికరమైన ఉత్పత్తులు అయితే.. వాటిని విక్రయించకూడదని అజయ్‌ అభిప్రాయ పడ్డాడు. అవి హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కాగా అజయ్‌ దేవగన్‌ ఎంతో కాలంగా ఇదే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్షయ్‌ కుమార్‌ ఈ యాడ్‌లో నటించడంపై ఆయన ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ఉత్పత్తులను తమ అభిమాన నటుడు ప్రమోట్‌ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అక్షయ్‌ని ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అవి చూసిన అక్షయ్‌ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. అయితే కాంట్రాక్ట్‌ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుందని అక్షయ్‌ స్పష్టం చేశాడు

Advertisement
 
Advertisement
 
Advertisement