భర్త, మామతో ఈవెంట్‌కు వెళ్లిన ఐశ్వర్య రాయ్‌.. కాకపోతే! | Sakshi
Sakshi News home page

Aishwarya Rai: విడాకుల రూమర్స్‌.. భర్త, మామతో ఐశ్వర్య డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Published Sat, Dec 16 2023 10:32 AM

Aishwarya Rai, Abhishek Bachchan Attends Aaradhya Bachchan School Functions - Sakshi

బాలీవుడ్‌ దంపతులు ఐశ్వర్య రాయ్‌- అభిషేక్‌ బచ్చన్‌ ఈ మధ్య ఎక్కువగా బయట కలిసి కనిపించడం లేదు. ఐశ్వర్య పుట్టినరోజున కూడా చాలా లేట్‌గా బర్త్‌డే విషెస్‌ తెలిపాడు అభిషేక్‌. అది కూడా ఏదో పైపైనే చెప్పినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు బచ్చన్‌ కుటుంబంలో ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఈ అనుమానాలు ఈమధ్య మొదలైనవి కాదు. కొన్నేళ్ల నుంచే వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సదరు పుకార్లను కొట్టిపారేశాడు అభిషేక్‌. ఇటీవల పొన్నియన్‌ సెల్వన్‌ 2 రిలీజైన సమయంలోనూ ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్వీట్‌ చేశాడు.

ఇంటి నుంచి బయటకు?
అయినప్పటికీ ఈ రూమర్స్‌ ఆగిపోలేదు. పైకి ఏదో కవరింగ్‌ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరే ఉందని అనుమానిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఐశ్వర్య.. తన కూతురిని తీసుకుని బచ్చన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తగారు జయాబచ్చన్‌తో చాలాఏళ్లుగా మాటలు లేవని, భర్తతోనూ విభేదాలు రావడంతో ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అభిషేక్‌- ఐశ్వర్య కలిసి కనిపించారు. వీరిద్దరూ ముంబైలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈవెంట్‌కు చెరో కారులో..
అయితే ఐశ్వర్య, తన తల్లి బృంద్య రాయ్‌తో కలిసి ఓ కారులో రాగా.. అభిషేక్‌, తన తండ్రి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి మరో కారులో ఈవెంట్‌కు హాజరయ్యారు. కారు దిగగానే ఐశ్వర్య.. బిగ్‌బీని పలకరించింది. అటు అభిషేక్‌.. భార్యపై చేయి వేసి ఆమెతో సరదాగా మాట్లాడుతూ లోనికి వెళ్లిపోయాడు. ఈవెంట్‌లోనూ బిగ్‌బీ, అభిషేక్‌, ఐశ్వర్య సరదాగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భర్తతో పాటు అదే కారులో వెళ్లింది ఐశ్వర్య. ఇది చూసిన జనాలు ఇదేం ట్విస్టు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: అపర్ణకు కంగ్రాట్స్‌ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..?

 
Advertisement
 
Advertisement