అపర్ణకు కంగ్రాట్స్‌ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..? | Aparna Balamurali Started Textile Business | Sakshi
Sakshi News home page

అపర్ణకు కంగ్రాట్స్‌ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..?

Dec 16 2023 7:04 AM | Updated on Dec 16 2023 12:45 PM

Aparna Balamurali Started Textile Business - Sakshi

కోలీవుడ్‌ హీరోయిన్‌ అపర్ణ బాలమురళికి నయనతార కంగ్రాట్స్‌ చెప్పారు.. ఎందుకు? ఏమిటా కథ. చూసేస్తే పోలా. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే నిర్మాతగా మారి రౌడీ పిక్చర్స్‌ పతాకంపై పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ చేతినిండా ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా ఇతర వ్యాపార రంగాల్లోనూ ప్రవేశించి సహ నటీమణులకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారు.

ఇకపోతే నటి అపర్ణ బాలమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2015లో మొదట మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆపై 2017లోకోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, సూరరై పోట్రు తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలో సూర్యకు జంటగా నటించి అందరి ప్రశంసలు అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కాగా మలయాళంలో బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం తమిళంలో ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 50వ చిత్రంలో నటిస్తున్నారు.

అలాంటిది అపర్ణ బాలమురళి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకొనే పనిలో పడినట్టు తెలుస్తోంది. అందుకు ఈ భామ నటి నయనతారను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నటిస్తూనే ఇతర రంగాలపై దృష్టి సాగించారు. అలా తన మిత్రులతో కలిసి వస్త్ర వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన నయనతార ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎక్స్‌ మీడియాలో చేసిన పోస్టులో ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీ నూతన వెంచర్‌ సక్సెస్‌ కావాలి. ఆల్‌ ద బెస్ట్‌’అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement