Aishwarya Lakshmi: అలా మారకపోతే ఈ ఫీల్డ్‌లో కొనసాగలేం: ఐశ్వర్య లక్ష్మి

Aishwarya Lekshmi Comments On Bold Photo Shoot In Instagram Goes Viral - Sakshi

ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతా ఈజీ కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంంది. హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేయాలన్నా.. మరీ ముఖ్యంగా ఇక్కడ నిలదొక్కు కోవాలన్నా ప్రతిభ, గ్లామర్‌ ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది. ఈ విషయాన్ని సైతం చాలామంది హీరోయిన్లు పబ్లిక్‌ గానే అంగీకరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా అవుననే అంటున్నారు.

(ఇది చదవండి: 'బిగ్‌బాస్'లో అనుకున్నదే జరిగింది.. వెళ్తూ షకీలా ఏడిపించేసింది!)

అయితే ఈ కేరళ కుట్టికి మొదట నటనపై ఆసక్తి లేదట. డాక్టర్‌ అవ్వాలని చదివిన ఐశ్వర్య లక్ష్మి ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంపై దృష్టి సారించారట. అలా పలు వాణిజ్య సంస్థలకు మోడల్‌గా పనిచేసిన ఈమె ఫొటోలు పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురితమవడం, దాంతో సినిమా అవకాశాలు రావడం అలా జరిగిపోయిందట. 

మలయాళంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి 2019లో విశాల్‌ కథానాయకుడు నటించిన యాక్షన్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అదేవిధంగా ధనుష్‌కు జంటగా నటించిన జగమే తంధిరం కూడా నేరుగా ఓటీపీలో స్ట్రీమింగ్‌ కావడంతో ఆ చిత్రం కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత విష్ణు విశాల్‌ సరసన నటించిన కట్టా కుస్తీ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో పూంగుళి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా గార్గీ చిత్రం ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తింది.

తాజాగా దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా కింగ్‌ ఆఫ్‌ కోత్త చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకు తగినట్లుగా గ్లామర్‌నే మార్గంగా ఎంచుకుంది. అందాలను ఆరబోస్తూ తీయించుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అలాంటి ఫొటోల గురించి నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై ఐశ్వర్య లక్ష్మి స్పందిస్తూ గ్లామర్‌కు మారడం తప్పనిసరి అని.. అది లేకపోతే ఈ ఫీల్డ్‌లో కొనసాగలేమని పేర్కొంది.
(ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top