మిస్ట‌రీ: అప్పుడు క‌ట్ట‌ప్ప‌, ఇప్పుడు సీత‌! | Adipurush: Kriti Sanon As Seeta Role | Sakshi
Sakshi News home page

ఆదిపురుష్‌: సీత‌గా బాలీవుడ్ భామ

Oct 16 2020 8:17 PM | Updated on Oct 16 2020 8:54 PM

Adipurush: Kriti Sanon As Seeta Role - Sakshi

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న ప్ర‌శ్న అప్ప‌ట్లో అంద‌రినీ వేధించింది. ఇప్పుడు ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తున్న "ఆదిపురుష్" చిత్రంలో సీత ఎవ‌ర‌నే ప్ర‌శ్న అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తోంది. అయితే సీత పాత్ర‌లో మొద‌ట కీర్తి సురేష్‌, త‌ర్వాత కియారా అద్వానీ, అనుష్క శ‌ర్మ న‌టించ‌నుందంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. కానీ ఆ వార్త‌ల‌ను చిత్ర‌యూనిట్ ఖండించింది. పైన పేర్కొన్న పేర్ల‌ల్లో ఎవ‌రూ ఈ సినిమాలో న‌టించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు ఫిల్మీదునియాలో సీత పాత్ర‌కు మ‌రో హీరోయిన్ ‌పేరు తెర‌పైకి వ‌చ్చింది. బాలీవుడ్ భామ కృతిసనన్ ఆదిపురుష్ కోసం సీత‌గా మారిపోనుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మనేదానిపై చిత్ర‌యూనిటే స్పందించాల్సి ఉంది. (చ‌ద‌వండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! )

కాగా‌ ప్యాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ "ఆది పురుష్"‌కు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ శ్రీరాముడి అవ‌తారంలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఇందుకోసం విలువిద్య సైతం నేర్చుకుంటున్నారు. నటుడు సైఫ్ అలీఖాన్ రావ‌ణుడి పాత్ర పోషించ‌నున్నారు. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. 3డీలో రూపొందనున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారట‌. (చ‌ద‌వండి: పురాణ పురుషులుగా హీరోలు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement