అంద విహీనంగా మారిపోయిన నటి ముఖం | Actress Urfi Javed Face Swollen | Sakshi
Sakshi News home page

Urfi Javed: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి

Jul 21 2025 4:23 PM | Updated on Jul 21 2025 4:36 PM

Actress Urfi Javed Face Swollen

తెరపై కనిపించే నటీనటులు చాలామంది చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంటారు. కాకపోతే ఆ విషయాన్ని చెప్పుకొనేందుకు పెద్దగా ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో మాత్రం వాటి గురించి చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్‌కి చెందిన ఉర్ఫి జావేద్ ముఖం కూడా ఇంతలా ఉబ్బిపోయింది. పెదాలు ఎర్రగా కందిపోయి కనిపించింది. దీంతో ఈమెకి ఏమైంది? ఎందుకిలా మారిపోయిందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ కోసం ప్రయత్నించింది. అయితే అప్పుడు అది వికటించడంతో పెదవుల రూపు మారిపోయి కాస్త ఉబ్బిపోయి కనిపించాయి. ఇప్పటికి అవి సెట్ అయ్యాయని ఉర్ఫి చెప్పుకొచ్చింది. లిప్ ఫిల్లర్స్ విషయంలో తాను కృత్రిమ పద్ధతిని ఉపయోగించి తప్పు చేశానని, అప్పుడు తన రూపు చూసుకుని తాను ఎంతగానో నవ్వుకున్నానని చివరకు తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్)

ఇన్నాళ్లకు సదరు లిప్ ఫిల్లర్లని కరిగించుకున్నానని ఉర్ఫి చెప్పింది. అయితే ఎవరూ కూడా తనలా ఈ తప్పు చేయొద్దని, ఒకవేళ లిప్ ఫిల్లింగ్ చేయాలనుకుంటే కచ్చితంగా అనుభవం ఉండే డాక్టర్ దగ్గరకు మాత్రమే వెళ్లాలని చెబుతూ సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఉర్ఫికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పెదలు ఉబ్బిపోయి, ముఖంతా ఎర్రగా మారిపోయి కనిపించింది.

ఉర్ఫి కెరీర్ విషయానికొస్తే.. హిందీ బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఇది కాకుండా ఎప్పటికప్పుడు విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ, ఆ వీడియోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేది. రీసెంట్ టైంలో ఒకటి రెండు ఓటీటీ రియాలిటీ షోల్లోనూ కనిపించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement