Actress Tanishq Rajan Comments About Her Movie Offers And Future Goals, Deets Inside - Sakshi
Sakshi News home page

Tanishq Rajan: ప్రకటనలు చేసే స్థాయి నుంచి హీరోయిన్‌గా ఎదిగిన తనిష్క్‌

Nov 30 2022 7:46 PM | Updated on Nov 30 2022 8:23 PM

Actress Tanishq Rajan About Movie offers - Sakshi

చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. కష్టపడి పని చేస్తే, మనసుకు నచ్చిన పని చేస్తే.. మనల్ని ఏది ఆపలేదు. నేను దర్శకుడు ఏం చెబితే అది చేసే నటిని

తనిష్క్ రాజన్.. రంగస్థల నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. నాలుగేళ్ల ప్రాయంలోనే నటిగా బుడిబుడి అడుగులు వేశారు. దేశవ్యాప్తంగా ఎన్నో నాటకాలు వేశారు. పన్నెండేళ్ల వయసులో ఆమె తన సోదరితో కలిసి ముంబైకి వెళ్లడంతో వెండితెరపై ప్రయాణం మొదలైంది. టీవీ రంగంలో ప్రకటనలు చేసే స్థాయి నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు. 2017లో శరణం గచ్చామి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తన నటన, అందంతో అందరినీ మెప్పించారు.

దీంతో ఆమెకు దేశంలో దొంగలు పడ్డారు, ఇష్టంగా, బైలంపూడి, కమిట్‌మెంట్ అనే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆమె నేనెవరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2న థియేటర్లో విడుదల కానుంది. ప్రస్తుతం తన చేతిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయని, హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నానని తెలిపారు. రీసెంట్‌గా ఆమె నటించిన దో లోగ్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది.

తనిష్క్‌ మాట్లాడుతూ.. 'చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. కష్టపడి పని చేస్తే, మనసుకు నచ్చిన పని చేస్తే.. మనల్ని ఏది ఆపలేదు. నేను దర్శకుడు ఏం చెబితే అది చేసే నటిని, ఆయన విజన్‌కు తగ్గట్టుగా నటించేందుకు ప్రయత్నిస్తాను. నా ప్రయాణం ఇంకా మొదలవ్వలేదని అనుకుంటాను.. అందుకే నేను ఇంకా కష్టపడి పని చేయాలనుకుంటున్నాను. ప్రేక్షకులందరి ప్రేమను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను. శాస్త్రీయ సంగీతం, నృత్య కళల్లోనూ ప్రావీణ్యం ఉంది. నేను అనుకుంది సాధించేందుకు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాను' అని తనిష్క్ తన సినీ ప్రయాణం, లక్ష్యం గురించి వివరించారు.

చదవండి: పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: నటి
రాజావారు రాణిగారు సినిమాకు మూడేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement