గాయపడ్డ సీనియర్ నటి రాధిక.. వీడియో వైరల్! | Sakshi
Sakshi News home page

Radhika Sarathkumar: అన్నతో చాన్నాళ్ల తర్వాత.. అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుని

Published Sat, May 18 2024 9:38 AM

Actress Radhika Sarathkumar Leg Injury

ఒకప్పటి హీరోయిన్ రాధిక గాయపడింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా తన రీల్ బ్రదర్ శివకుమార్ ఇంటికి వచ్చేసరికి అతడితో పాత ముచ్చట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)

ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాధిక.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తల్లి పాత్రలు చేస్తోంది. అలానే గతంలో పలు సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి అలరించింది. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో శివకుమార్ (హీరో సూర్య తండ్రి)కి చెల్లిగా పలు సీరియల్స్ చేసింది. అయితే వీళ్లు సీరియల్స్‌లో నటించి చాలా కాలమైంది.

ఇక చాలా రోజుల తర్వాత రాధిక ఇంట్లో వీళ్లిద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే తనకు కాలికి గాయమైన విషయాన్ని రాధిక బయటపెట్టింది. అప్పటి ఆల్బమ్స్, పాత ముచ్చట్లని వీళ్లిద్దరూ గుర్తుచేసుకున్నారు. కొన్నిరోజుల ముందు 'యానిమల్' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..)

Advertisement
 
Advertisement
 
Advertisement